Andhra Pradesh: మోదీ, జగన్ అంటే అసహ్యమేస్తోంది.. సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్..

ప్రధాని మోదీ, సీఎం జగన్ అంటేనే ప్రజలకు తీవ్ర అసహ్యమేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీని, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు నారాయణ.

New Update
CPI Narayana: కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ ఓడిపోతాయి.. సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు

CPI Narayana: ప్రధాని మోదీ, సీఎం జగన్ అంటేనే ప్రజలకు తీవ్ర అసహ్యమేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీని(BJP), ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ(YSRCP)ని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు నారాయణ(CPI Narayana). ఏపీలో సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర తిరుపతికి చేరుకుంది. ఈ సందర్భంగా నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో బస్సు యాత్ర ముగింపు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇతర ప్రముఖలతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల నుంచి కమ్యూనిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన నారాయణ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ పాలనలో వేంకటేశ్వర స్వామిని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. టిటిడిలో సారాయి అమ్మే వాళ్ళను సభ్యులుగా నియమించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల నడక దారిలో వెళ్లే భక్తులకు కర్రలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు నారాయణ.

శేషాచలంలో ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారని, వెయ్యిమంది వైసిపి కార్యకర్తలకు కర్రలిచ్చి పంపండంటూ సెటైర్లు వేశారు నారాయణ. చంద్రగిరి నుంచి వస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లను తరిమికొట్టండని అన్నారు. ప్రభుత్వ పెద్దలకు తెలిసే ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు నారాయణ. ఎర్రచందనం స్మగ్లర్లను అరికట్టండని, నాటకాలు ఆడొద్దంటూ ప్రభుత్వ పెద్దలను హెచ్చరించారు సీపీఐ నేత. అలాగే రాష్ట్రంలో పెరుగుతున్న గంజాయి స్మగ్లింగ్‌పై తీవ్రంగా స్పందించారు నారాయణ. గంజాయి విక్రయాలకు సీఎం జగనే అసలు సూత్రధారి అంటూ తీవ్ర ఆరోపణలు చేశారాయన. ప్రత్యేక హోదా ఏమైంది? వైసీపీ ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదు? అంటూ నిలదీశారు. పనిలో పనిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ పైనా తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ తన కుమార్తె కవిత కాపాడుకునేందుకు మోడీకి సాగిలపడుతున్నారని విమర్శించారు. సీపీఐ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని, బీజేపీకి ఎవరు మద్థతిచ్చినా ఆ పార్టీని రాష్ట్రాల్లో ఓడిస్తామని స్పష్టంగా ప్రకంటించారు నారాయణ.

విదేశాల్లో మోదీ దత్తపుత్రులు..

ఇదే సమయంలో ప్రధాని మోదీపైనా విమర్శలు గుప్పించారు సీపీఐ నారాయణ. విపక్షాలను చూస్తే ప్రదాని మోదీకి భయమేస్తోందన్నారు. మోడీ దత్తపుత్రులు విదేశాల్లో ఉన్నారని, వారంతా రూ. 14 లక్షల కోట్లు తినేశారని అన్నారు. అవినీతిపరులను దేశానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు నారాయణ. దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ గ్రాఫ్ పడిపోతోందన్నారు.

చంద్రబాబుపై అరెస్ట్‌పై కామెంట్స్.

రాష్ట్ర విపక్ష నేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేయడంపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. చంద్రబాబుకు అండగా నిలిచే ప్రయత్నం చేశారాయన. చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. ‘బాబును అరెస్ట్ చేయాలంటే చేయండి.. కానీ, కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన వ్యక్తి మాత్రం ముఖ్యమంత్రిగా ఉండొచ్చా?’ అని ప్రశ్నించారు నారాయణ.

Also Read:

Telangana: బీజేపీకి షాక్.. ఆ బంధం చూసి ఉండలేనంటూ పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత..

Joe Biden: ఢిల్లీ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

Advertisment
తాజా కథనాలు