Telangana Congress on CPI Seats..! సీపీఐకి ఇచ్చే సీట్లివే!

కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఐ సై అంటోంది. ఏడు సీట్లు అడుగుతున్న సీపీఐకి..3 లేదా 5 సీట్లు ఇచ్చేందుకు హస్తం ఓకే అనేట్లుగా తెలుస్తోంది. పొత్తులు, సీట్ల కేటాయింపుపై కమ్యూనిస్టులతో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్‌ సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.

New Update
Telangana Congress on CPI Seats..! సీపీఐకి ఇచ్చే సీట్లివే!

Telangana Congress on CPI Seats..! : కాంగ్రెస్‌(Congress)తో పొత్తుకు సీపీఐ(CPI) సై అంటోంది. ఏడు సీట్లు అడుగుతున్న సీపీఐకి..3 లేదా 5 సీట్లు ఇచ్చేందుకు హస్తం ఓకే అనేట్లుగా తెలుస్తోంది. కమ్యూనిస్టులతో  కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌(KC Venugopal) పొత్తులు, సీట్ల కేటాయింపుపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.

కాంగ్రెస్‌తో నడిచేందుకే కామ్రేడ్లు మొగ్గు చూపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో జత కట్టేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీ వేణుగోపాల్‌తో సీపీఐ నారాయణ భేటీ అయ్యారు. చర్చలు సఫలమయ్యాయని, కాంగ్రెస్ తో కలిసి వెళ్తామని నారాయణ చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర సీపీఎం నేతలతో జాతీయ కాంగ్రెస్ నేతలు చర్చలు చేయనున్నారు. గెలవగలగే స్థానాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెరో సీటు ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కమ్యూనిస్టులు మాత్రం చెరో మూడు సీట్ల కోసం పట్టుబడుతున్నారు. చెరొకటి లేదా చెరో రెండు సీట్లతో పొత్తు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. మునుగోడు, కొత్తగూడెం, హూస్నాబాద్, బెల్లంపల్లి, దేవరకొండ,వైరా, పినపాక సీట్లును కామ్రేడ్లు కోరుకుంటున్నారు.

అభ్యర్థుల ప్రకటనతో వామపక్షాలైన సీపీఐ, సీపీఎం పార్టీలకు ఊహించని షాక్ తగిలినట్టయ్యింది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్(BRS).. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పొత్తును కొనసాగిస్తుందనే వార్తలు వచ్చాయి. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో సీటు లేదా చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు కేసీఆర్ సముఖత వ్యక్తం చేశారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు తమకు కబురు పంపుతారని వామపక్ష నేతలు కూడా చెబుతూ వచ్చారు. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా అయింది. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. వామపక్షాలకు సీట్లు కేటాయించలేదు. ఒకవేళ వారితో పొత్తు పెట్టుకునే ఉద్దేశ్యంతో ఉంటే వారికి కేటాయించే సీట్లను పెండింగ్‌లో పెట్టేవారు. కానీ అలా జరగలేదు.

ఈ ఏడాది చివర్లోగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలి కాలంలో కామ్రేడ్లతో స్నేహం చేసిన కేసీఆర్..ఇప్పుడు మళ్లీ వాళ్లను దూరం పెట్టారు. కమ్యూనిస్టులకు కేసీఆర్ ఒక్క సీటును కూడా కేటాయించలేదు. దీంతో కాంగ్రెస్ వైపు కమ్యూనిస్టులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సీపీఐ నారాయణ  పొత్తులు, సీట్ల కేటాయింపుపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఏ సీట్లు ఇస్తారనేది ఈ నెల 17లోపు తేల్చనున్నారు కాంగ్రెస్ పెద్దలు.  కాగ, ఫస్ట్‌ లిస్ట్‌ వచ్చేలోపే పొత్తుల్ని తేల్చాలంటున్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Also Read: బీజేపీ జిల్లా ఇన్‌ ఛార్జ్‌లను మార్చే యోచనలో అధిష్టానం!

Advertisment
తాజా కథనాలు