ప్రధాని మోదీ (PRIME MINISTER MODI) చంద్రయాన్ ని కూడా ఒక మతానికి ముడి పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు సీపీఐ నారాయణ. చంద్రయన్ 3 (CHANDRAYAN 3)లాంచ్ అయిన ప్రాంతానికి శివశక్తి (SIVASAKTI)అని పేరు పెట్టటాన్ని ఆయన తప్పుపట్టారు. చంద్రయాన్ విజయవంతం కావటంతో, విదేశాల్లో మోడీ గ్రాఫ్ పెరుగుతోందని, భారతదేశంలో మాత్రం వందే భారత్ ట్రైన్ మాదిరిగా వేగంగా పతనమవుతోందని వ్యాఖ్యానించారు.
మణిపూర్ భగ్గుమంటున్నా చలించటం లేదు
మోదీ ఎక్కడెక్కడికో పర్యటనకు వెళ్తున్నారు కానీ మణిపూర్ (MANIPUR) వెళ్లడం లేదని నారాయణ విమర్శించారు. డి. రాజా ఆధ్వర్యంలో తాము మణిపూర్ లో పర్యటించాం అని, తిరిగొచ్చిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి పరిస్థితిని వివరించామని చెప్పారు.
మణిపూర్ లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని తెలిపారు నారాయణ. కుకీస్, మైటీస్, నాగాస్ ఎవరి ప్రాంతాల్లో వాళ్లే ఉండే విధంగా బార్కెడ్లు ఏర్పాటు చేశారు. మణిపూర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నిద్రపోతున్నాడు. ముఖ్యమంత్రి ని తొలగించాలి అని ఆయన డిమాండ్ చేశారు.
గ్యాస్ సిలిండర్ తగ్గింపు ఎన్నికల స్టంటే
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర 200 రూపాయలు తగ్గించినట్లు ప్రకటించటం ఎన్నికల వ్యూహమేనని నారాయణ విమర్శించారు.
''కాంగ్రెస్ పార్టీ గ్యాస్ ధర ను 20 రూపాయలుపెంచితే, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే 2014లో మోడీ ప్రధాని అయ్యేటప్పటికీ ఎంత రేటు ఉందో ఇప్పుడు అదే రేటు ఉంటే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు ఒప్పుకుంటాం" అన్నారు.
బీజేపీ ముసుగులో కేసీఆర్, జగన్
కేసీఆర్ బీజేపీ ముసుగులో ఉన్నాడని, మోదీ ఏం చెబితే అదే చేస్తున్నాడు. ఏపీలో వైసీపీది అదే పరిస్థితి అని ధ్వజమెత్తారు నారాయణ. విభజన చట్టంలోని హామీలను కేంద్రం ఎందుకు అమలు చేయలేకపోతున్నారని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడగడం లేదు. ప్రధానమంత్రి హోదాలో అమరావతిలో పునాది రాయి వేశారు దానికి అన్యాయం జరుగుతుంటే మోదీ ఎందుకు స్పందించడం లేదు? అని ఆయన ప్రశ్నించారు.ఆంధ్రప్రదేశ్ కి బిజెపి అన్ని రకాలుగా అన్యాయం చేసింది. టీడీపీ పరోక్షంగా, ప్రత్యక్షంగా బిజెపికి సహాయం చేయకూడదని అన్నారు.
ఆయన ఏమన్నారంటే..
➼ అవినాష్ రెడ్డి అరెస్ట్ కావాల్సి ఉంది. జగన్ అమిత్ షా ను కలిసి అవినాష్ రెడ్డి బెయిల్ పొడిగించాలని కోరాడు.
➼ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారాడు. కవితను అరెస్ట్ చేయాల్సి ఉంది. కానీ కేసీఆర్
కేంద్ర ప్రభుత్వ పెద్దల ను కలిశారు. కవిత అరెస్టు నిలిచిపోయింది.
➼ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న శరత్ చంద్ర రెడ్డిని టీటీడీ బోర్డు మెంబర్ గా ఎన్నుకున్నారు.
➼ తిరుపతి దేవస్థానం పరిసరాల్లో మద్యం, మాంసం విక్రయాలు నిషేధం . మద్యం అమ్మేవాళ్ల నే టిటిడి మెంబర్ గా ఎన్నుకోవడం ఎంత వరకు కరెక్ట్ ?
➼ ఎన్వీరమణ తర్వాత న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం పోయింది.
➼ విభజన చట్టంలోని హామీలను కేంద్రం ఎందుకు అమలు చేయలేకపోతున్నారని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడగడం లేదు.
➼ ప్రధానమంత్రి హోదాలో అమరావతిలో పునాది రాయి వేశారు దానికి అన్యాయం జరుగుతుంటే మోదీ ఎందుకు స్పందించడం లేదు.
➼ ఎన్వీరమణ తర్వాత న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం పోయింది
➼ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిసి ఫ్రంట్ గా ఏర్పడితే బిజెపి గ్రాఫ్ వేగంగా తగ్గిపోతుంది.
➼ కాంగ్రెస్,సీపీఐల కలయిక అనేది నిశ్చితార్థం దశలో ఉంది.
➼ ఇండియా కూటమి 26 పార్టీల సమావేశానికి సీపీఐ తరపున డీరాజా హాజరవుతారు.