Cow And House: ఇంటి ముందుకు వచ్చిన ఆవుకు ఇలా చేస్తే ఎంతో పుణ్యం

ఆవు ఇంటి ముందుకు వస్తే ఆ రోజు శుభ‌వార్త వింటార‌ని చెబుతున్నారు. ఆవుల పాదాల్లో పితృ దేవ‌త‌లు, అడుగుల్లో ఆకాశగంగ‌, స్థనాల్లో చ‌తుర్వేదాలు, పాలు పంచామృతాలు, క‌డుపు భాగంలో కైలాసం ఉంటాయని చెబుతారు. స‌క‌ల దేవ‌త‌ల ఆశీస్సులు కోసం ఆవుని పూజించాలని అంటున్నారు.

Cow And House: ఇంటి ముందుకు వచ్చిన ఆవుకు ఇలా చేస్తే ఎంతో పుణ్యం
New Update

Cow And House: హిందువులు ఆవును పవిత్రంగా భావిస్తారు. చాలాసార్లు ఇంటి ముందుకు వచ్చి ఆవులు ఆగుతూ ఉంటాయి. గోవులో స‌క‌ల దేవ‌త‌లు నిక్షిప్తమై ఉంటార‌ని పురాణాల్లో ఉంది. ఆవుల పాదాల్లో పితృ దేవ‌త‌లు, అడుగుల్లో ఆకాశగంగ‌, స్థనాల్లో చ‌తుర్వేదాలు, పాలు పంచామృతాలు, క‌డుపు భాగంలో కైలాసం ఉంటాయని చెబుతారు.

publive-image

స‌క‌ల దోషాలు తొల‌గుతాయి:

ఒక్క గోవుకు ప్రదక్షిణం చేస్తే అన్ని దేవ‌త‌ల‌కు ప్రద‌క్షిణం చేసినట్టు అని పండితులు చెబుతున్నారు. ఆవు కొమ్ముల్లో బ్రహ్మ, విష్ణువులు ఉంటారని అంటున్నారు. ఆవు మన ఇంటి ముందు వచ్చి నిలుచుంటే దేవతలు వచ్చి ఉన్నట్టే అని పురాణాలు చెబుతున్నాయి. గోవును పూజించినట్లయితే స‌క‌ల దోషాలు తొల‌గుతాయని, కుటుంబానికి శుభ గ‌డియ‌లు రానున్నాయ‌ని అర్థం అని పండితులు చెబుతున్నారు. స‌క‌ల దేవ‌త‌ల ఆశీస్సులు కోసం ఆవుని పూజించాలని అంటున్నారు.

publive-image

అంతేకాకుండా.. ఆవు ఇంటి ముందుకు వస్తే ఆ రోజు శుభ‌వార్త వింటార‌ని చెబుతున్నారు. ఆవు ఇంటి ముందుకు వస్తే పూజించాలి. దానికి సంతృప్తిగా మేత‌, శెన‌గ‌లతో పాటు బెల్లం తినిపిస్తే దేవ‌త‌లు సంతోషపడతారు. గోవుకి మ‌న‌సారా న‌మ‌స్కరిస్తే శుభఫలితం దక్కుతుంది. గోవు చుట్టూ 5 సార్లు ప్రద‌క్షిణ‌లు చేస్తే భూమి చుట్టూ ప్రద‌క్షిణ చేసినంత పుణ్యం అని పండితులు అంటున్నారు. అందుకే ఆవు మన ఇంటి ముందుకు వచ్చి నిలుచుంటే దానికి ఏదోకటి తినిపించాలని, నీళ్లుతాగించాలని సలహా ఇస్తున్నారు.

publive-image

దానికి పసుపుతో బొట్టుపెట్టినా మంచిదే అని చెబుతున్నారు. సాధారణంగా గోమూత్రంతో ఎన్నో ఆయుర్వేద మందులు కూడా తయారు చేస్తారు. కొందరు గోపంచకాన్ని నేరుగా తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల యవ్వనంగా ఉంటారని నమ్ముతారు. ఎన్నో రోగాలను నయం చేసే శక్తి గోమాతకు ఉంది.

ఇది కూడా చదవండి: చనిపోయిన బంధువులు కలలోకి వస్తే ఏమవుతుంది..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#cow-and-house
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe