Cow And House: ఇంటి ముందుకు వచ్చిన ఆవుకు ఇలా చేస్తే ఎంతో పుణ్యం ఆవు ఇంటి ముందుకు వస్తే ఆ రోజు శుభవార్త వింటారని చెబుతున్నారు. ఆవుల పాదాల్లో పితృ దేవతలు, అడుగుల్లో ఆకాశగంగ, స్థనాల్లో చతుర్వేదాలు, పాలు పంచామృతాలు, కడుపు భాగంలో కైలాసం ఉంటాయని చెబుతారు. సకల దేవతల ఆశీస్సులు కోసం ఆవుని పూజించాలని అంటున్నారు. By Vijaya Nimma 10 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Cow And House: హిందువులు ఆవును పవిత్రంగా భావిస్తారు. చాలాసార్లు ఇంటి ముందుకు వచ్చి ఆవులు ఆగుతూ ఉంటాయి. గోవులో సకల దేవతలు నిక్షిప్తమై ఉంటారని పురాణాల్లో ఉంది. ఆవుల పాదాల్లో పితృ దేవతలు, అడుగుల్లో ఆకాశగంగ, స్థనాల్లో చతుర్వేదాలు, పాలు పంచామృతాలు, కడుపు భాగంలో కైలాసం ఉంటాయని చెబుతారు. సకల దోషాలు తొలగుతాయి: ఒక్క గోవుకు ప్రదక్షిణం చేస్తే అన్ని దేవతలకు ప్రదక్షిణం చేసినట్టు అని పండితులు చెబుతున్నారు. ఆవు కొమ్ముల్లో బ్రహ్మ, విష్ణువులు ఉంటారని అంటున్నారు. ఆవు మన ఇంటి ముందు వచ్చి నిలుచుంటే దేవతలు వచ్చి ఉన్నట్టే అని పురాణాలు చెబుతున్నాయి. గోవును పూజించినట్లయితే సకల దోషాలు తొలగుతాయని, కుటుంబానికి శుభ గడియలు రానున్నాయని అర్థం అని పండితులు చెబుతున్నారు. సకల దేవతల ఆశీస్సులు కోసం ఆవుని పూజించాలని అంటున్నారు. అంతేకాకుండా.. ఆవు ఇంటి ముందుకు వస్తే ఆ రోజు శుభవార్త వింటారని చెబుతున్నారు. ఆవు ఇంటి ముందుకు వస్తే పూజించాలి. దానికి సంతృప్తిగా మేత, శెనగలతో పాటు బెల్లం తినిపిస్తే దేవతలు సంతోషపడతారు. గోవుకి మనసారా నమస్కరిస్తే శుభఫలితం దక్కుతుంది. గోవు చుట్టూ 5 సార్లు ప్రదక్షిణలు చేస్తే భూమి చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం అని పండితులు అంటున్నారు. అందుకే ఆవు మన ఇంటి ముందుకు వచ్చి నిలుచుంటే దానికి ఏదోకటి తినిపించాలని, నీళ్లుతాగించాలని సలహా ఇస్తున్నారు. దానికి పసుపుతో బొట్టుపెట్టినా మంచిదే అని చెబుతున్నారు. సాధారణంగా గోమూత్రంతో ఎన్నో ఆయుర్వేద మందులు కూడా తయారు చేస్తారు. కొందరు గోపంచకాన్ని నేరుగా తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల యవ్వనంగా ఉంటారని నమ్ముతారు. ఎన్నో రోగాలను నయం చేసే శక్తి గోమాతకు ఉంది. ఇది కూడా చదవండి: చనిపోయిన బంధువులు కలలోకి వస్తే ఏమవుతుంది..? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #cow-and-house మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి