డేటా లీక్ కాలేదన్న కేంద్రప్రభుత్వం.. కోవిన్ పోర్టల్ పూర్తిగా సేప్.... By Shareef Pasha 14 Jun 2023 in నేషనల్ New Update షేర్ చేయండి భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్న లక్షల మంది వ్యక్తుల డేటా లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి.రాజకీయ నాయకులతో పాటు పలువురు ప్రముఖుల పాస్‌పోర్ట్‌లు, ఐడీ కార్డ్ నంబర్లు, పుట్టినరోజులు, ఫోన్ నంబర్లు తదితర సమాచారం టెలిగ్రామ్ యాప్‌లో అందుబాటులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.టెలిగ్రామ్ యాప్‌లో ఎవరిదైనా నంబర్‌ను ఎంటర్ చేయగానే, వారికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చని చెబుతున్నారు.అనేక మంది ప్రముఖుల సమాచారాన్ని తాము చూడగలుగుతున్నామని పేర్కొంటూ చాలా మంది వ్యక్తులు టెలిగ్రామ్ యాప్ స్క్రీన్‌షాట్‌లను ట్విటర్‌లో పంచుకుంటున్నారు. అయితే ఈ వార్తలు నిరాధారమైనవని భారత ప్రభుత్వం చెప్పింది. కోవిన్ ప్లాట్‌ఫారమ్ పూర్తిగా సురక్షితమైనదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. "ఈ వార్తలకు ఎలాంటి ఆధారమూ లేదు. ఇవి దురుద్దేశపూర్వకమైనవని వ్యాఖ్యానించింది. రాజ్యసభ ఎంపీ డెరిక్ ఒబ్రియాన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం, కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాజ్యసభ ఎంపీ సుష్మిత్ దేవ్, అభిషేక్ మను సింఘ్వీ, సంజయ్ రౌత్ వంటి నాయకుల వివరాలు ఉచితంగా లభిస్తున్నాయి అని సాకేత్ గోఖలే చెప్పారు. వీరే కాకుండా, రాజ్‌దీప్ సర్దేశాయ్, బర్ఖాదత్, ధన్య రాజేంద్రన్, రాహుల్ శివశంకర్ వంటి జర్నలిస్టుల వ్యక్తిగత సమాచారం కూడా అందుబాటులో ఉందని ఆయన ఆరోపించారు.ఈ డేటా లీకేజ్ గురించి హోంశాఖతో పాటు నరేంద్ర మోదీ సర్కారుకు సమాచారం లేదంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆధార్, పాస్‌పోర్ట్ వంటి ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని మోదీ ప్రభుత్వమే ఎవరికో లీక్ చేసింది. దాని ఫలితంగానే ఈ డేటా లీక్ జరిగింది. ఇది ఒక జాతీయ సమస్యని సాకేత్ గోఖలే తన ట్వీట్‌లో విమర్శించారు. డేటా లీక్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి కోరారు.వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇది ఉల్లంఘించడమేనని ఏచూరి అన్నారు. ఈ అంశంపై సీపీఎం ఒక ప్రకటన విడుదల చేసింది. "ఆరోగ్య శాఖ 2021 జూన్‌లో ఇలాంటి ఆరోపణలనే ఖండించింది. అయితే, కోవిన్ సిస్టమ్ డేటా లీక్‌పై దర్యాప్తు చేయాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ను ఆదేశించింది. ఈ దర్యాప్తుకు సంబంధించిన వివరాలను ఇంకా ప్రజలకు వెల్లడించలేదని ప్రకటనలో చెప్పింది. కోవిడ్ డేటా లీక్ వార్తలపై స్పష్టత ఇవ్వాలంటూ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ వార్తలన్నీ నిజమైతే, ప్రభుత్వం తక్షణమే దీనిపై వివరణ ఇవ్వాలి. ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ట్వీట్ చేశారు. భారత పౌరులుగా, మేం మా డేటాను వివిధ ప్రభుత్వ పోర్టల్‌లలో నమోదు చేస్తాం. మా డేటా భద్రత కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా ప్రైవసీ గురించి ఎలాంటి సందేహాలూ తలెత్తకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య శాఖకు చెందిన కో-విన్ పోర్టల్ పూర్తిగా సురక్షితం. అందులోని డేటా గోప్యతకు తగిన భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నాం. వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్, యాంటీ డీడీవోఎస్, ఎస్‌ఎస్‌ఎల్/టీఎల్‌ఎస్‌లతో పాటు తరచుగా పరిశీలన చేస్తున్నాం. ఓటీపీ ఆధారిత యాక్సెస్ మాత్రమే ఉంటుంది. కో-విన్ పోర్టల్‌లో డేటా భద్రతను నిర్ధరించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆరోగ్యశాఖ చెప్పింది. 2021లో కూడా కో-విన్ పోర్టల్‌లోని కోట్ల మంది వ్యక్తుల డేటా లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల డేటా లీక్ అయినట్లు 2022లో కూడా వార్తలు వచ్చాయి. వార్తాసంస్థ పీటీఐ ప్రకారం, రెడ్ ఫోరమ్ వెబ్‌సైట్‌లో ఒక సైబర్ నేరస్థుడు తన వద్ద 20 వేల మందికి పైగా వ్యక్తుల డేటా ఉందన్నాడు. 2022 జనవరిలో, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్‌ఎస్ శర్మ మాట్లాడుతూ, "కో-విన్ అనేది అత్యాధునిక భద్రతా వ్యవస్థ. ఇది ఎన్నడూ భద్రతా ఉల్లంఘనను ఎదుర్కోలేదు. యాప్‌లోని మా పౌరుల డేటా కచ్చితంగా సురక్షితంగా ఉంటుంది. కోవిన్ డేటా లీక్‌కు సంబంధించిన ఏ వార్తలోనూ నిజం లేదన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి