వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌ను రద్దు..! రాజమహేంద్రవరం జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్‌లో 24 సీట్లుండగా 40 జనరల్ మెడిసిన్ సీట్లను భర్తి చేసినట్లు గుర్తించింది నేషనల్ మెడికల్ కమిషన్ . మెడికల్ కళాశాలలు సీట్ల భర్తీలో అవకతవకల కారణంగా వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌ను రద్దు చేశారు. రెండు రోజుల్లో కొత్త సీట్ మెట్రిక్స్ తయారుచేసి సీట్ల భర్తీ చేస్తామని విశ్వవిద్యాలయ వర్గాలు చెబుతున్నాయి. By Trinath 31 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి విజయవాడ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌ను రద్దు చేశారు. మెడికల్ కళాశాలలు సీట్ల భర్తీలో అవకతవకలకు పాల్పడ్డారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌లు. నకిలీ సర్టిఫికేట్స్ సమర్పించి పీజీ సీట్లు పొందినట్లు నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ధారించింది. కౌన్సిలింగ్ ప్రక్రియ తిరిగి ప్రారంభించాలని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటికి ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల శాంతి రామ్ మెడికల్ కాలేజీలో 7 ఎండి జనరల్ మెడిసిన్ సీట్లకు బదులుగా, 24 సీట్లను భర్తీ చేశారాని NMC గుర్తించారు. రాజమహేంద్రవరం జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్‌లో 24 సీట్లుండగా 40 జనరల్ మెడిసిన్ సీట్లను భర్తి చేసినట్లు గుర్తించింది NMC. మరో రెండు కాలేజ్‌లో అవకతవకలు గుర్తించారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు కంటే అధికంగా సీట్లను భర్తి చేశారని ఆరోపించారు. కౌన్సిలింగ్ ప్రక్రియ అర్ధాంతరంగ ఆగిపోవడంతో వైద్య విద్యార్ధులు అయోమయంలో పడ్డారు. త్వరలోనే తిరిగి కౌన్సిలింగ్ చెపడతామని వై.ఎస్.ఆర్ హెల్త్ యూనివర్సిటీ వీ.సీ చెప్పారు. ఇప్పటికే విశ్వవిద్యాలయం గతవారం మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహించి కన్వీనర్ కోటాలో 1295 సీట్లు యాజమాన్య కోటాలో 588 సీట్లు భర్తీ చేసింది.. కొంతమంది విద్యార్థులు ఆయా కళాశాలలకు వెళ్లి చేరారు. మిగిలిన వారు సెప్టెంబర్ 2 లోపు జాయిన్ అవ్వాలి. ప్రస్తుత ఉత్తర్వులతో వారంతా అయోమయానికి గురయ్యారు. రెండు రోజుల్లో కొత్త సీట్ మెట్రిక్స్ తయారుచేసి సీట్ల భర్తీ చేస్తామని విశ్వవిద్యాలయ వర్గాలు చెబుతున్నాయి. దీని కారణంగా కొంతమంది సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. వివాదాల్లో హెల్త్ యూనివర్శిటీ: ఇటివలి కాలంలో వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ వివాదాల్లో ఉంటుంది. మూడు వారాల క్రితం జీవో నెంబర్ 107, 108 లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు హెల్త్ యూనివర్సిటీ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఆ సమయంలో యూనివర్సిటీ ముట్టడికి వచ్చిన విద్యార్థి సంఘాల నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జీవో నెంబర్ 107, 108 జీవోల వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు నష్టపోతున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మెడికల్ కాలేజీల్లో ఈ జీవోలను తీసుకువచ్చిందని మండిపడ్డారు. ALSO READ: ఏపీలో నిరుద్యోగులకు బంపర్ న్యూస్.. వేల సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి