Corona JN1 Symptoms : జేఎన్1 కరోనా(JN1 Corona) వేరియంట్ ప్రజలను భయందోళనకు గురిచేస్తోంది. కరోనా కొత్త వేరియంట్ తో యూపీ, కేరళల్లో గడిచిన 24 గంటల్లో ఐదుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. కేరళలో వేగంగా వ్యాప్తి చెందుతుందని..గత 24 గంటల్లోనే 127 కొత్త కేసులు నమోదైనట్లు తెలిపారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.
కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ పెద్ద ఎత్తున ప్రజలపై ప్రభావం చూపించనున్నదని WHO హెచ్చరించింది. జ్వరం, దగ్గు, అలసట, ముక్కు దిబ్బడ, గొంతు మంట, తలనొప్పి వంటివి కొవిడ్ జెఎన్ 1 లక్షణాలు అని తెలిపింది. ఈ లక్షణాలు ఉంటే వెంటనే ఆర్‌టీపీసీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని ఆదేశించింది. కొవిడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: పైల్స్ సమస్యతో బాధపడేవారు వీటికి కచ్చితంగా దూరంగా ఉండాలి!
కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ ద్వారా ప్రభావమైన వారిలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గి అనారోగ్యాలకు గురి చేస్తోందని హెచ్చరిస్తున్నారు. రోగనిరోధక శక్తి తక్కువుగా ఉన్నవారిపై, వృద్ధులపై, మధుమేహం, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలున్నవారిపై బాగా ప్రభావం చూపించే అవకాశముందని చెబుతున్నారు.
ప్రజలు ఈ వేరియంట్ పై చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రయాణికులు కొవిడ్ రూల్స్ పాటిస్తూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. నియమాలు పాటించకుండా ఉంటే గతంలోని పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. కాబట్టి కొవిడ్ నియమాలు పాటిస్తూ సేఫ్ గా ఉండాలని అని అధికారులు చెబుతున్నారు.