Hyderabad Numaish : కరోనా ఎఫెక్ట్.. ఈ రూల్ పాటించకుంటే నుమాయిష్ కు నో ఎంట్రీ! 83వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించనున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు 45రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.కోవిడ్ నేపథ్యంల నుమాయిష్ కు వచ్చేవాళ్లకు మస్క్ తప్పనిసరి చేశారు. By Bhoomi 01 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి 83వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్(New Year Numaish 2024) కు హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ రెడీ అయ్యింది. నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు 45రోజులపాటు నిర్వహించనున్న ఈ ఎగ్జిబిషన్ లో దేశం నలుమూలల నుంచి సుమారు 2400స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించనున్నారు.అయితే ఈసారి నుమాయిష్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu)ను నియమించారు. 80ఏళ్లుగా తెలంగాణలో జరుగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ కు దేశవ్యాప్తంగా వ్యాపారులు వస్తారని శ్రీధర్ బాబు తెలిపారు. చాలా మంది నుమాయిష్ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటారని..వారికి సొసైటి ప్రోత్సహం అందిస్తుందని తెలిపారు. ఎగ్జిబిషన్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్టు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కోవిడ్ ప్రబలుతున్న నేపథ్యంలో నుమాయిష్ వచ్చే వీక్షకులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని నిర్వహకులు తెలిపారు. మస్క్ లేనివారికి లోపలికి అనుమతించమని వెల్లడించారు. టికెట్ ధర : ఈ సారి ఎగ్జిబిషన్ టికెట్ ధర రూ. 40గా నిర్ణయించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎగ్జిబిషన్ లోపల వెహికల్స్ తో సందర్శించే ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈ వెహికల్స్ కు ప్రత్యేక ఛార్జీ చేయాల్సి ఉంటుంది. గతంలో దీనికోసం రూ. 600వసూలు చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 3.30 నుంచి రాత్రి 10.30 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్(Exhibition Ground) లోకి సందర్శకులను అనుమతిస్తారు. స్పెషల్ బస్సులు: ఇక నుమాయిస్ ఎగ్జిబిషన్ కోసం టీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సుల (TS RTC Special Buses)ను నడపనుంది. నాంపల్లి, గాంధీభవన్ మెట్రోస్టేషన్లు ఎగ్జిబిషన్ మైదానానికి సమీపంగా ఉంటాయి. మియాపూర్, ఎల్బీనగర్, నాగోల్, రాయదర్గం మార్గాల్లో నడిచే మెట్రో రైళ్లను నుమాయిస్ ను పరిగణలోనికి తీసుకుని అర్థరాత్రి వరకు పొడిగించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా మెట్రో రైల్ కోసం స్పెషల్ టికెట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. 22లక్షల మంది సందర్శకులు: ఈ ఎగ్జిబిషన్ కు దాదాపు 22లక్షల మంది సందర్శకులు(22 Lakh Visitors) వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తారు. ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకులను గోషామహల్, అజంతా గేట్, గాంధీ భవన్ గేట్ల దగ్గర మెటల్ డిటెక్టర్లతో చెక్ చేసి లోపలికి అనుమతిస్తారు. ప్రతిఏడాది మాదిరిగానే ఈ ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం పలు సాంస్క్రుతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. క్రీడా, పోటీలు, వినోద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: కొత్త ఏడాది గ్రాండ్ ఓపెనింగ్…ఈనెలలో లాంచ్ కానున్న 3 ఎస్ యూవీలు ఇవే..!! #chief-minister-revanth-reddy #hyderabad-numaish #exhibition-ground #duddilla-sridhar-babu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి