Corona Danger Bells: కరోనా కథ అయిపోయినట్లే అని అందరూ అనుకున్నారు. ఇంకా చెప్పాలంటే.. కరోనా అనేది ఒకటి ఉంది అనే విషయమే మర్చిపోయారు. కరోనా తీసుకువచ్చిన చీకటి రోజులు పీడకల అని వదిలేశారు. అప్పుడప్పుడు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఒకటి రెండు కరోనా కేసులు ఉన్నాయి అని తెలిసినా లైట్ తీసుకుంటూ వచ్చారు భారతీయులు. కానీ, ఇప్పుడు మళ్ళీ కరోనా టెన్షన్ స్టార్ట్ అయింది. కొత్తగా వచ్చిన వేరియంట్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. డేంజర్ బెల్స్(Corona Danger Bells) మోగిస్తోంది. ఒక్కసారిగా ఆందోళనలో పడేసింది. ఈ వేరియంట్ పెద్ద ప్రమాదకారా? కాదా? అనేది చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనివలన వచ్చిన ప్రమాదం ఏమీ లేదని అంటోంది. అయినా, జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని హెచ్చరిస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్(Corona Danger Bells) మోగుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా క్రమేపీ విస్తరిస్తూ వస్తోంది. ఇప్పటికే తెలంగాణలో50కి పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత రెండు వారాలుగా 6,344 శాంపిల్స్ సేకరించారు. 118 ల్యాబ్స్‌లో కరోనా టెస్టులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం కూడా అప్రమత్తం అయి RTPCR టెస్టులు పెంచాలని ఆదేశాలు జరీ చేసింది. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏ మాత్రం అనుమానం ఉన్నా సరే RTPCR టెస్ట్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తూ వస్తున్నారు.
తెలంగాణ భూపాలపల్లి జిల్లాలో కరోనా టెన్షన్ పెడుతోంది. అక్కడ ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్ రావడంతో(Corona Danger Bells) కలకలం రేగింది. వీరికి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 1,322 శాంపిళ్లను పరీక్షించగా... 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 30 ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇవాళ ఒకరు కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రోగుల రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది.
Also Read: కరోనా.. మళ్ళీ పెరుగుతోంది.. ఇప్పటి వేరియంట్ వలన ప్రమాదం ఎంత?
ఇక అటు ఏపీలోనూ కేసులు(Corona Danger Bells) పెరుగుతూ వస్తున్నాయి. ఏపీలో కేసుల సంఖ్య 23 కు చేరుకుంది. విశాఖ, విజయవాడల్లో కేసులు పెరుగుతూ వస్తున్నాయి. శ్రీకాకుళంలో ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్ వెల్లడి అయింది. ఈ సాంపిల్స్ ను అధికారులు జీనోమ్ టెస్టుకు పంపుతున్నారు.
అలాగే, దేశవ్యాప్తంగా చూసుకుంటే యాక్టివ్ కేసులు 4 వేల మార్క్ ను దాటాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 628 కేసులు నమోదు అయ్యాయి. కేరళలో పరిస్థితి అదుపు తప్పినట్టు కనిపిస్తోంది. అక్కడ ఒక్కరోజులో 128 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మూడోవంతు కేసులు(Corona Danger Bells) అంటే 3 వేలకు పైగా యాక్టివ్ కేసులు కేరళలోనే ఉన్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. నెలరోజుల్లోనే 52 శాతం కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర థానేలో కొత్త వేరియంట్ కలకలం సృష్టించింది. అక్కడ JN-1 కొత్త వేరియంట్ కేసులు 5 నమోదు అయ్యాయి. ఈ వేరియంట్ తో కరోనా కేసుల సమాఖ్య పెరుగుతూ వస్తోంది.
Watch this interesting Video: