కానిస్టేబుల్ అభ్యర్థులు లక్డీకాపూల్ లోని డీజీపీ ఆఫీస్ ను ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డుపైనే ఆందోళనకారులు బైఠాయించి నిరసన తెలపడంతో.. ట్రాఫిక్ జామ్ అయింది. ఇక క్లియర్ చేయడానికి ప్రయత్నించిన పోలీసులతో కానిస్టేబుల్ అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో వారికి పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. తరువాత పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి స్థానిక పోలీసు స్టేషన్ కు తరలించారు. కాగా, 2022 నోటిఫికేషన్లో కానిస్టేబుల్ నియామకాల్లో తీసుకొని వచ్చిన జీవో నెంబర్ 46 ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఈ జీవోను రద్దు చేయడంతో పాటు పాత పద్ధతిలోనే నియామకాలను చేపట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు.
దీని ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన జీవో 46 కారణంగా చాలా నష్టపోతున్నామని కానిస్టేబుల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.