Congress: మహాలక్ష్మి స్కీమ్‌ ద్వారా నెలకు రూ. 2500..రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌!

కాంగ్రెస్‌ విజయభేరి మీటింగ్ ఆరు గ్యారంటీలను ప్రకటించారు సోనియా గాంధీ. మహాలక్ష్మి స్కీమ్‌ ద్వారా నెలకు రూ. 2,500 ఇస్తామని..రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు సోనియా. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.. ఇక తుక్కుగూడలో కాంగ్రెస్‌ విజయభేరి సభ జరుగుతోంది. కార్యకర్తల నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగుతోంది. లైవ్‌లో చూడండి

New Update
Congress: మహాలక్ష్మి స్కీమ్‌ ద్వారా నెలకు రూ. 2500..రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌!

కాంగ్రెస్‌ విజయభేరి మీటింగ్ ఆరు గ్యారంటీలను ప్రకటించారు సోనియా గాంధీ. మహాలక్ష్మి స్కీమ్‌ ద్వారా నెలకు రూ. 2,500 ఇస్తామని..రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు సోనియా. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మరోవైపు సోనియాగాంధీ తెలంగాణకి తల్లి లాంటివారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కొనియాడారు. మాట తప్పని, మడమ తిప్పని నేత సోనియా అని చెప్పారు. కేసీఆర్ గుండెలు అదిరేలా సోనియాకు స్వాగతం పలికామని రేవంత్‌రెడ్డి తెలిపారు. సోనియా సందేశం కోసం తెలంగాణ ఎదురుచూస్తోందన్నారు రేవంత్‌రెడ్డి. రాజీవ్‌గాంధీ నాలెడ్జ్‌ సెంటర్‌ను సోనియా గాంధీ ప్రారంభించారు. తెలంగాణ ప్రజలకు నా నమస్కారాలంటూ సోనియా గాంధీ ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు.

తెలంగాణలో ఆరు గ్యారంటీలను రాష్ట్ర ప్రజల అభివృద్ధే లక్ష్యంగా అమలు చేస్తామని సోనియా తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలని.. అప్పుడే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమని, ఇదే తన కోరిక అని సోనియా గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెడతామని తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజలను అభివృద్ధి చేయడం రాష్ట్రం ఇచ్చిన వాళ్లుగా తమ మీద బాధ్యత ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని తెలంగాణ ప్రజలను కోరారు.

గ్యారంటీలను ప్రకటించిన సోనియా:

➼ మహాలక్ష్మి పేరుతో మహిళలకు రూ.2,500

➼ విద్యార్థులకు రూ. 5లక్షలతో భరోసా కార్డు

➼ ఆసరా స్కీమ్‌ కింద రూ.4 వేల వృధ్యాప్య పెన్షన్

➼ రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌

➼ మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం

➼ ఏటా రైతులకు రూ.15వేల సాయం

➼ రైతు కూలీలకు రూ. 12 వేల సాయం

కాంగ్రెస్ 6 గ్యారంటీలు:

1) మహాలక్ష్మి
ప్రతినెలా మహిళలకు రూ.2500
రూ.500 గ్యాస్‌ సిలిండర్
RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం

2) యువ వికాసం
విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు
ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్

3) గృహజ్యోతి
200 యూనిట్ల ఉచిత విద్యుత్

4) ఇందిరమ్మ ఇళ్లు
ఇల్లులేని వారికి ఇంటి స్థలం
రూ. 5లక్షల సాయం
ఉద్యమకారులకు 250 గజాల స్థలం

5) చేయూత
నెలవారి పింఛన్ రూ. 4వేలు
10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా

6) రైతు భరోసా
ఏటా రూ.15 వేలు
వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు
వరి పంటకు రూ.500 బోనస్

రాహుల్‌ ఏం అన్నారంటే?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రోజునే తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ హామీలన్నింటినీ అమలు చేయడం ప్రారంభిస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. తన తల్లి సోనియా గాంధీ ఎంత కష్టమైనా, సవాలు చేసినా వాగ్దానాన్ని ఎప్పటికీ ఉల్లంఘించరని తనకు తెలుసునన్నారు.

ALSO READ: మరో ఏడుగురు అరెస్ట్ అవ్వబోతున్నారు.. సీఐడీ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు