Congress: తెలంగాణపై కాంగ్రెస్ హామీల వర్షం.. సోనియా ప్రకటించిన 6 గ్యారంటీలు ఇవే..

తుక్కుగూడ వేదికగా.. తెలంగాణపై హామీల వర్షం కురిపించింది కాంగ్రెస్. ఒట్టి హామీలే కాదండోయ్.. ఆ హామీలకు గ్యారెంటీ కూడా ఇస్తామంటోంది. అవును, తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ తీసుకున్న 6 గ్యారంటీలను ఆ పార్టీ ముఖ్య నాయకురాలు సోనియా గాంధీ ప్రకటించారు.

Congress: తెలంగాణపై కాంగ్రెస్ హామీల వర్షం.. సోనియా ప్రకటించిన 6 గ్యారంటీలు ఇవే..
New Update

Congress 6 Guarantees: తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) దూకుడు పెంచింది. కర్నాటక(Karnataka)లో మాదిరిగానే తెలంగాణ(Telangana)లోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని గట్టి సంకల్పంతో ఉంది. అందుకే.. తుక్కుగూడ వేదికగా.. తెలంగాణపై హామీల వర్షం కురిపించింది కాంగ్రెస్. ఒట్టి హామీలే కాదండోయ్.. ఆ హామీలకు గ్యారెంటీ కూడా ఇస్తామంటోంది. అవును, తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ తీసుకున్న 6 గ్యారంటీలను ఆ పార్టీ ముఖ్య నాయకురాలు సోనియా గాంధీ ప్రకటించారు. తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభా వేదికగా ఈ గ్యారంటీలను అనౌన్స్ చేశారు.

ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. తెలంగాణలో ఆరు గ్యారంటీలను రాష్ట్ర ప్రజల అభివృద్ధే లక్ష్యంగా అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలని.. అప్పుడే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమని, ఇదే తన కోరిక అని సోనియా గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెడతామని తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలను అభివృద్ధి చేయడం రాష్ట్రం ఇచ్చిన వారిపై తమపై బాధ్యత ఉందన్నారు. దశాబ్దాల కలను నెరవేర్చిన కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని తెలంగాణ ప్రజలను కోరారు సోనియా గాంధీ.

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యాలరెంటీలు ఇవే..

1. రైతుభరోసా – రైతులు, కౌలురైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయం. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 500 బోనస్.

2. మహాలక్ష్మి స్కీమ్ – మహిళలకు ప్రతి నెలా రూ. 2,000 సాయం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్.

3. గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు.

4. ఇందిరమ్మ ఇళ్లు – ఇల్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం. ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలం కేటాయించడం జరుగుతుంది.

5. యువ వికాసం – విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.

6. చేయూత – నెలకు రూ. 4,000 చొప్పున పింఛను. రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా.

ఈ హామీలను తప్పక అమలు చేస్తామని కాంగ్రెస్ అధినాయకత్వం తుక్కుగూడ సభావేదికగా తెలంగాణ ప్రజలకు గ్యారెంటీ ఇచ్చారు. మరి ఈ గ్యారెంటీలను ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనే వేచి చూడాలి.

Also Read:

Maruti Fronx: జస్ట్ రూ. 50 వేలు ఉంటే కొత్త కారు మీ సొంతం.. పూర్తి వివరాలు ఇవే..

Kaapu politics: రంగా లక్ష్యలను, ఆశయాలను తాకట్టు పెట్టారు.. పవన్‌కి వ్యతిరేకంగా విజయవాడలో మీటింగ్‌!

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe