Telangana Congress: ఆ ఇద్దరు నేతలకు కాంగ్రెస్ షాక్.. పార్టీ నుంచి సస్పెండ్.. ఎందుకంటే?

కాంగ్రెస్ లో అసమ్మతి గళాలు షురూ అయ్యాయి. టికెట్ రాని నేతలంతా ఒక్కొక్కరుగా తమ అసమ్మతిని వినిపిస్తున్నారు. తాజాగా గాంధీభవన్ లో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. మేడ్చల్ టికెట్ హర్షవర్దన్ రెడ్డికే కేటాయించాలంటూ వారు డిమాండ్ చేశారు. అటు మరో నేత టీపీసీసీ కార్యదర్శి కురువ విజయ్ కుమార్ కూడా ఆందోళన బాట పట్టారు. రేవంత్ రెడ్డి రూ. 600కోట్లకు 65 సీట్లను అమ్ముకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

New Update
Telangana: కాంగ్రెస్‌ ఫైనల్‌ లిస్ట్‌? జాబితాలో 17 మంది పేర్లు.. పలువురి పేర్లు మిస్సింగ్‌!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో బాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాతో పార్టీలో అసమ్మతి గళాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. టికెట్ ఆశించి భంగ పడ్డ నేతలంతా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు, నిరసనలతో పోరుబాట పడుతున్నారు. పార్టీపై అసహనం వ్యక్తం చేస్తూ పలు ఆరోపణలు చేస్తున్నారు.

తాజాగా గాంధీభవన్ ముందు మేడ్చల్ నియోజకవర్గకాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. మేడ్చల్ ఎమ్మెల్యే టికెట్ హర్షవర్దన్ రెడ్డికే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అంతేకాదు మేడ్చల్ సర్వే రిపోర్టును బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బచావో..అంటూ నినాదాలతో హోరెత్తించారు. మేడ్చల్ టికెట్ తనకే వస్తుందని ఆశించిన హర్షవర్దన్ రెడ్డికి కాంగ్రెస్ షాకిస్తూ...తోటకూర జంగయ్యకు సీటును కేటాయించింది.

ఇది కూడా చదవండి: ఐటీ ఉద్యోగులకు షాక్.. గంటకు 23 మంది ఔట్..!!

అటు మరో నేత టీపీసీసీ కార్యదర్శి కరువు విజయ్ కుమార్ సైతం తన నిరసన గళాన్ని విప్పారు. గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ఆందోళనకు దిగారు. ఎకరాకు 10కోట్ల చొప్పున 5ఎకరాల భూమికి గద్వాల్ టికెట్ రేవంత్ రెడ్డి అమ్ముకున్నారంటూ ఆరోపించారు. నాడు ఓటుకు నోటు...నేడు సీటుకు నోటు అంటూ నినాదాలు చేశారు. 65సీట్లను రేవంత్ రెడ్డి 600కోట్లకు అమ్ముకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కష్టపడి పనిచేసినవారికి కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుందని మండిపడ్డారు.

అయితే ఈ పరిణామాలన్నింటినీ పరిశీలించిన పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఇద్దరు నాయకులను సస్పెండ్ చేసింది. గద్వాల్ టికెట్ ఆశించిన కురువ విజయకుమార్, బహదూర్ పుర నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన బాబాలను క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి సస్పెండ్ చేశారు. సోమవారం గాంధీభవన్ లో సమావేశం అయి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: మార్గదర్శి కేసులో రామోజీరావుకు బిగ్ షాక్…కేసు నమోదు చేసిన సీఐడీ..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు