Six Gurantees card: గ్యారంటీ కార్డులిస్తామంటున్నారా..! నమ్మకండి By Naren Kumar 13 Dec 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Fake Six Guarantees Card: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇచ్చిన ఆరు హామీలూ ఎంతగా ప్రజల్లోకి వెళ్లాయో తెలిసిందే. మొదట్లోనే ప్రభుత్వం రెండు గ్యారంటీలను కూడా అమలు చేయడంతో వాటిపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే, ప్రజల ఆశను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం అందించే ఆరు హామీల ప్రయోజనాలనూ పొందేందుకు తప్పనిసరి అంటూ ఓ కార్డును ముద్రించి జనానికి అంటగడుతున్నారు. ఒక్కో కార్డుకూ రూ. 200 నుంచి రూ. 500 వరకూ వసూలు చేస్తూ మోసగిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఓం బిర్లాను కలిసిన ప్రతాప్ సింహ..! పాస్ ఎందుకు ఇచ్చానంటే? కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను (Congress Guarantees) ముద్రించి నకిలీ కార్డులను జనానికి అంటగడుతూ కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. కొన్ని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు, మీసేవా కేంద్రాల్లో ఆయా హామీలన్నిటినీ కార్డులపై ముద్రించి విక్రయిస్తున్నారు. పథకం పేరు, పార్టీ గుర్తు, లోకల్ ఎమ్మెల్యే లేదా కాంగ్రెస్ తరఫున పోటీలో దిగిన అభ్యర్థి ఫొటో, లబ్ధిదారుడి పేరు, ఫోన్ నంబరును కార్డుపై ముద్రించి అమ్మేస్తున్నారు. వీటికోసం జనం మీసేవా కేంద్రాల వద్ద బారులు తీరి మరీ కొనుగోలు చేస్తుండడం గమనార్హం. ఇది కూడా చదవండి: ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన మేకలు.. అవి చేసిన తప్పేంటంటే సోమవారం నాడు షాద్ నగర్లో ‘మహాలక్ష్మి’ (Mahalakshmi Scheme) నకిలీ కార్డు వెలుగులోకి రాగా, ఒక్క రోజు గడవకముందే నగరంలోనూ ఈ దందా బయటపడింది. గోషామహల్ లో కూడా ఈ రకమైన నకిలీ కార్డుల దందాను గుర్తించారు. దీంతో ఆ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సునీతారావు, పీసీసీ సీనియర్ నేత జి. నిరంజన్ దీనిపై డీజీపీని (DGP) కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాకు సమాచారమిచ్చారు. ప్రభుత్వం ఎలాంటి కార్డులూ మంజూరు చేయలేదని, ప్రజలు మోసపోవద్దని కోరారు. #crime-news #6-guarantees-card-fraud మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి