ఈ సారి ఎలాగైనా గెలవాల్సిందే భయ్యా..టీ.కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ ప్రకటన.. టీమ్‌లో ఎవరెవరున్నారంటే? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బరిలోకి దూకుతున్న కాంగ్రెస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీని ప్రకటించింది. ఏఐసీసీ నేతలు మురళీధరన్, బాబా సిద్దిఖీ, జిగ్నేష్ మేవాని ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. By Trinath 03 Aug 2023 in రాజకీయాలు New Update షేర్ చేయండి తెలంగాణ(Telangana)లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకునేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్(congress) ఈ సారి కొత్త ఉత్సహంతో బరిలోకి దిగేందుకు రెడీ అవుతుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో హస్తం పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. బీఆర్‌ఎస్ నుంచి అసంతృప్తులు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీని ప్రకటించింది. ఏఐసీసీ నేతలు మురళీధరన్(muralitharan), బాబా సిద్దిఖీ, జిగ్నేష్ మేవాని(Jignesh mevani) ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావు థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(revanth reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిను స్క్రీనింగ్ కమిటీ ఎక్స్అఫిషియో మెంబర్లుగా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు: రెండు మూడు నెలల ముందు వరకు కాంగ్రెస్ వేరు ఇప్పుడు వేరు..! తెలంగాణలో బలమైన క్యాడర్ కలిగి ఉన్న కాంగ్రెస్ నిన్నమొన్నటివరకు రాష్ట్రంలో నెంబర్-3 పొజిషన్‌లో ఉన్నట్టు కనిపించినా.. ఇప్పుడు మాత్రం హస్తం బీఆర్‌ఎస్(BRS)కు ప్రధాన పోటిదారుగా కనిపిస్తుంది. సీనియర్లు కలిసికట్టుగా పని చేసి.. తెలంగాణ ఇచ్చిన సెంటిమెంట్ కూడా వర్క్ అవుటై.. రాహుల్ గాంధీ కూడా తనదైన మార్క్ చూపిస్తే ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు విశ్లేషకులు. వారి మాట ఎలా ఉన్నా కాంగ్రెస్ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఓవైపు బీఆర్‌ఎస్ తన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న సమయంలోనే ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీని ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమవుతుంది. కోమటిరెడ్డికి నో ఛాన్స్: తెలంగాణ వర్షాకాల సమావేశాల ప్రారంభం తొలిరోజే ఏఐసీసీని కీలక అప్‌డేట్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది కాంగ్రెస్. ఇటు లోకల్ లీడర్లు సైతం దూకుడు పెంచారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటేనంటూ ప్రజల్లోకి ఓ అభిప్రాయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అటు బీఆర్‌ఎస్ కూడా ఇటివలి కాలంలో కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తుంది. నిజానికి మూడేళ్లుగా బీఆర్‌ఎస్‌కి బీజేపీనే ప్రధాన పోటిదారుగా కనిపించినా ఇటివలి జరిగిన పరిణామాలు ఆ పార్టీని కాస్త వెనక్కి నెట్టాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఎవర్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.. ఎవరి గేమ్ ప్లాన్ వారిది. కాంగ్రెస్ కూడా అందుకే ఎవరికి ఏ మాత్రం చాన్స్ ఇవ్వకూడదని ఫిక్స్ ఐనట్టు కనిపిస్తుంది. నిరసనల ద్వారా ప్రజల్లోకి వెళ్తూనే తెలంగాణ సెంటిమెంట్‌ని రాజేసే ప్రయత్నం చేస్తుందన్న వాదన వినిపిస్తుంది. నిత్యం అంతర్గత కుమ్మూలాటల పార్టీగా ముద్రపడ్డ కాంగ్రెస్ ఇటివలి కాలంలో ఇంటర్నెల్ గొడవలకు దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. ఉచిత కరెంట్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల రచ్చ కూడా త్వరగానే ముగిసిపోయింది. మరోవైపు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్లేస్ లేకపోవడంపై ఆయన మద్దతుదారులు పెదవి విరుస్తున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి