V. Hanumantha Rao: నాకు ఎంపీ టికెట్ వస్తే గెలిచేవాడిని.. వీహెచ్ కీలక వ్యాఖ్యలు

TG: తనకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే గెలిచేవాడిని అని అన్నారు కాంగ్రెస్ నేత హనుమంతరావు. ఎనిమిదేళ్లలో తనకు ఒక్క పదవి లేదని చెప్పారు. తనను రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని అన్నారు. కాగా కేశవరావు రాజీనామాతో రాజ్యసభలో ఒక స్థానం కాంగ్రెస్ చేతిలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

New Update
V. Hanumantha Rao: నాకు ఎంపీ  టికెట్ వస్తే గెలిచేవాడిని.. వీహెచ్ కీలక వ్యాఖ్యలు

V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభకు తనకు అవకాశం ఇస్తే బాగుంటుందని అన్నారు. ఎనిమిదేళ్లలో తనకు ఒక్క పదవి లేదని చెప్పారు. సికింద్రాబాద్‌లో (Secunderabad) తనకు ఎంపీ టికెట్ వస్తే గెలిచేవాడిని అని అన్నారు. టీ-20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సిరాజ్‌కు (Mohammed Siraj) సీఎం రేవంత్ ప్లాట్, ఉద్యోగం ఇస్తాననడం హర్షణీయం అని అన్నారు. గతంలో అతని ప్రతిభను చూసి సీఎఫ్ఐ ఛైర్మెన్‌గా సన్మానించినట్లు చెప్పారు. ఏపీలో 12 క్రికెట్ స్టేడియాలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో స్టేడియానికి ప్రతి జిల్లాలో 12 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రేవంత్ రెడ్డికి విన్నపించారు.

కాగా.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన దానం నాగేందర్ కు ఎంపీ టికెట్ కేటాయించింది. లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ ఓటమిని చవి చూసింది. సికింద్రాబాద్ లో బీజేపీ నేత కిషన్ రెడ్డి విజయం సాధించారు.

ఖమ్మం కరుణించలేదు..

ఖమ్మం ఎంపీ టికెట్ కోసం హనుమంతరావు ఎన్నో ప్రయత్నాలు చేశారు. టికెట్ కోసం పలుమార్లు ఢిల్లీ నేతల చుట్టూ తిరిగారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఖమ్మంలో తానూ ఈజీగా గెలుస్తానని చెప్పారు. కాగా ఖమ్మం టికెట్ తనకే వస్తుందని ఆశించిన వీహెచ్ కు నిరాశే ఎదురైంది. ఆయనకు అధిష్టానం టికెట్ కేటాయించలేదు. మరోవైపు అదే సమయంలో వీహెచ్ అనారోగ్యంతో హాస్పిటల్ భారిన పడిన విషయం తెలిసిందే. మొన్న కేకే రాజీనామాతో రాజ్యసభ ఒక సీటు ఖాళీ కావడంతో వీహెచ్ ఇప్పుడు ఆ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: నిరుద్యోగులపై పోలీసుల జూలుం.. ఖాకీల తీరుపై తీవ్ర విమర్శలు!

Advertisment
తాజా కథనాలు