TS Politics: ఇస్తే నా కొడుక్కు, కుదరకపోతే సీపీఎంకు.. మిర్యాలగూడపై జానారెడ్డి మెలిక

ఇస్తే తన కొడుక్కు, లేకుంటే సీపీఎంకు మిర్యాలగూడ టికెట్ ను కేటాయించాలన్న భావనతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే ఆయన సీపీఎంతో పొత్తుకు ఆరాటపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరో నేత బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదని తెలుస్తోంది.

TS Politics: ఇస్తే నా కొడుక్కు, కుదరకపోతే సీపీఎంకు.. మిర్యాలగూడపై జానారెడ్డి మెలిక
New Update

తెలంగాణలో సీపీఐ(CPI), సీపీఎం(CPM), కాంగ్రెస్(Congress) కలిసి పోటీ చేస్తాయని అంతా భావించారు. కానీ సీట్ల లెక్కల్లో సయోధ్య కుదరకపోవడంతో సీపీఎం ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతోంది. సీపీఐకు కేవలం ఒక్క కొత్తగూడెం టికెట్ మాత్రమే ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీలను ఇస్తామని తెలిపింది. ఇందుకు సీపీఐ కూడా ఓకే చెప్పింది. అయితే.. సీపీఎంకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ జిల్లాలోనూ మంచి పట్టు ఉంది. కానీ సీట్ల అడ్జస్ట్మెంట్ కుదరకపోవడంతో ఆ జిల్లాల కాంగ్రెస్ ముఖ్య నేతలు పొత్తు విషయాన్ని పక్కకు పెట్టేశారు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి (Janareddy) మాత్రం ఇంకా సీపీఎంతో పొత్తు కోసం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. కమ్యూనిస్టులపై జానారెడ్డికి అకస్మాత్తుగా ప్రేమ పెరగడానికి కారణం ఏంటన్న అంశంపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎంకి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కానీ ఆ సీటుతో పాటు మరో సీటును సీపీఎం అడుగుతోంది.

ఇది కూడా చదవండి: BJP Final List: ఆ 11 మంది ఎవరు?.. కొనసాగుతున్న ఉత్కంఠ!

ఆ విషయంలోనే సీట్ల పంచాయితీ తెగక సీపీఎం ఒంటరి పోరుకు సిద్ధమైంది. అయితే.. ఆఖరి నిమిషంలో మళ్లీ పొత్తు కుదిరినా సీపీఎంకు మిర్యాలగూడ సీటును ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసమే కాంగ్రెస్ కూడా మిర్యాలగూడ సీటును ప్రకటించలేదు. అయితే.. మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి కాకుండా సీపీఎం అభ్యర్థే పోటీ చేయాలని జానారెడ్డి భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఎందుకంటే.. జానారెడ్డికి మొదటి నుంచి మిర్యాలగూడపై మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే మిర్యాలగూడ టికెట్ ను తన తనయుడు రఘవీర్ కు ఇప్పించాలని ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే.. జిల్లాకు చెందిన మరో ఇద్దరు అగ్రనేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి సపోర్ట్ తో బీఎల్ఆర్ (బత్తుల లక్ష్మారెడ్డి) పేరును హైకమాండ్ పరిశీలిస్తోంది.

దీంతో జానారెడ్డి కుమారుడికి టికెట్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో తన కుమారుడు కాకుండా వేరే అభ్యర్థి పోటీ చేసే బదులు సీటును సీపీఎంకు ఇప్పించడం బెటరని జానారెడ్డి భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా అయితే.. భవిష్యత్ లో అయినా పరిస్థితులు అనుకూలిస్తే తన కుమారుడికి మిర్యాలగూడ టికెట్ వస్తుందని ఆయన ఆశలు పెట్టుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే.. సీపీఎం ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాల్లో ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ చేస్తున్నారు. సీపీఎంతో పొత్తులేకపోతే వీరికే నష్టం ఉండే అవకాశం ఉంటుంది. కానీ వారు మాత్రం మిర్యాలగూడలో కాంగ్రెస్ పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. కానీ జానారెడ్డి మాత్రం సీపీఎం పోటీ చేయాలని ప్రయత్నించడం ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

#telangana-elections-2023 #kunduru-janareddy #uttam-kumar-reddy #nalgonda
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe