Telangana: తెలంగాణతో మాకున్నది ప్రేమానురాగాల బంధం.. రాహుల్ ఆసక్తికర కామెంట్స్..

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం జోరుగా సాగుతోంది. మంథనిలో రోడ్ షో నిర్వహించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. '2004 లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చింది.. రాష్ట్రం ఏర్పాటు చేసి ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుంది' అని గుర్తు చేశారు. అయితే, ఏ ఆకాంక్షలతో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందో ఆ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.

Rahul Gandhi: ఉపాధి హమీ కూలీలు, కౌలు రైతులకు రాహుల్ ఆఫర్..
New Update

Rahul Gandhi in Telangana: తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రచారం జోరుగా సాగుతోంది. మంథనిలో రోడ్ షో నిర్వహించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. '2004 లో తెలంగాణ(Telangana) ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చింది.. రాష్ట్రం ఏర్పాటు చేసి ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుంది' అని గుర్తు చేశారు. అయితే, ఏ ఆకాంక్షలతో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందో ఆ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. దీనికి కారణం తెలంగాణ దొరల పాలనలోకి వెళ్లడమేనని వ్యాఖ్యానించారు. ఇది దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న యుద్ధం అని పేర్కొన్నారు రాహుల్. కేసీఆర్ తనను తాను ఒక రాజుగా భావిస్తున్నారని, ఎన్నికల్లో ఓడిస్తే ఆ భావం నుంచి బయటకొస్తారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఫలాలు ఒకే కుటుంబానికి దక్కుతున్నాయని ఆరోపించారు రాహుల్ గాంధీ. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు దోచుకున్నారని సంచలన ఆరోపణుల చేశారు. ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రజలకు మాత్రం నీళ్లు అందడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైనా లబ్ధి పొందారంటే.. అది కేవలం కేసీఆర్ కుటుంబమేనని అన్నారు.

ఇదికూడా చదవండి: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..

కేసు పెట్టి సభ్యత్వం రద్దు..

బీజేపీపై తాను పోరాడుతున్నందుకు తనపై కేసు పెట్టారని, లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని అన్నారు రాహుల్ గాంధీ. విపక్షాలపై కేసులు పెట్టె మోదీ.. కేసీఆర్ పై ఏ కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు రాహుల్. దేశంలో అత్యంత అవినీతి సీఎం కేసీఆర్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకే తాను ముక్కలని ఆరోపించారు. దేశంలో ఎంఐఎం పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చి బీజేపీకి ఎంఐఎం లబ్ది చెకూరుస్తోందన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసేది కేవలం రాహుల్ గాంధీనే అని దేశ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. 'నరేంద్ర మోదీ ప్రతీ కుటుంబానికి రూ.15లక్షలు అందిస్తామని చెప్పారు.. నల్లధనాన్ని వెనక్కు తెస్తామన్నారు.. ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాలు ఇస్తామని కేసీఆర్ చెప్పారు.. వీళ్లిద్దరూ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారు.' అని నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ.

తాను ఇక్కడికి అబ్దాలు చెప్పడానికి రాలేదని, చేసేది, చేయాలనుకున్నది చెప్తున్నామన్నార రాహుల్ గాంధీ. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వస్తోందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందని ఉద్ఘాటించారాయన. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతీ నెల రూ.2500 అందిస్తామని ప్రకటించారు. తాము ఇచ్చిన హమీల అమలుపై కర్నాటకలో అడగండని ప్రజలకు సూచించారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామో లేదో తెలుస్తుందన్నారు రాహుల్. ఇదే సమయంలో దేశ సంపద ఎటు పోతోందో ఎవరికీ అర్ధంకాని పరిస్థితి ఉందంటూ సందేహం వ్యక్తం చేశారు. కుల గణన అంశాన్ని ప్రస్తావిస్తూ.. తెలంగాణలో బీసీల సంఖ్య ఎంతుందో తెలియదన్నారు. దేశంలో కుల గణన చేపడితేనే అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయని, కుల గణన దేశానికి ఎక్స్ రె లాంటిదని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ.

ఇదికూడా చదవండి: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు..

తెలంగాణలో ప్రేమానురాగాల బంధం..

నిన్న తన సోదరి ప్రియాంక గాంధీని తెలంగాణకు తెరసుకొచ్చానని గుర్తు చేసిన ఆయన.. తెలంగాణ ప్రజలతో తనకున్నది రాజకీయ అనుబంధం కాదని, కుటుంబ అనుబంధం అని అన్నారు. నెహ్రూ, ఇందిరమ్మ నుంచి ఈ బంధం కొనసాగుతోందని చెప్పారు. తెలంగాణలో తమకు ఉన్నది రాజకీయ బంధం కాదు..ప్రేమానురాగాల అనుబంధం అని పేర్కొన్నారు.

#rahul-gandhi #telangana-elections #telangana-politics #rahul-gandhi-in-telangana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe