TS Congress BC Declaration: BC-Aలోకి ముదిరాజ్ లు.. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ హైలెట్స్ ఇవే!

ముదిరాజ్ లను బీసీ-డీ నుంచి ఏలోకి మారుస్తామని కాంగ్రెస్ పార్టీ తన బీసీ డిక్లరేషన్ లో ప్రకటించింది. ఈ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభను నిర్వహించింది కాంగ్రెస్. ఈ సభలో బీసీల్లోని అన్ని ముఖ్యమైన కులాలకు హామీలను ప్రకటించింది హస్తం పార్టీ.

New Update
TS Congress BC Declaration: BC-Aలోకి ముదిరాజ్ లు.. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ హైలెట్స్ ఇవే!

అధికారంలోకి వస్తే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ రోజు ఆ పార్టీ బీసీ డిక్లరేషన్ ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కామారెడ్డిలో ప్రకటించారు.  మండలానికి ఒక బీసీ గురుకులం ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్లో పేర్కొన్నారు. కార్పొరేషన్ ద్వారా ఒకొక్కరికి రూ.10 లక్షల సాయం చేస్తామని తెలిపారు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. ముదిరాజ్ లను బీసీ-డీ నుంచి ఏలోకి మారుస్తామన్నారు. రానున్న ఐదేళ్లలో బీసీల సంక్షేమం కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండ రాం, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి:

బీసీ డిక్లరేషన్ ముఖ్యమైన హామీలు..
- గంగపుత్రుల కోసం మత్స్య అభివృద్ధి బోర్డు
- అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గొల్ల కురుమలకు 2వ దశ గొర్రెల పంపిణీ
- గీత కార్మికుల కోసం ఈత చెట్ల పెంపకానికి ప్రతీ గ్రామంలో ఐదు ఎకరాల భూమి.. మద్యం షాపుల్లో రిజర్వేషన్లు 15 నుంచి 25 శాతానికి పెంపు
- జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పపన్న గౌడ్ గా పేరు మార్పు
- మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు
- పద్మశాలీల కోసం జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్లూమ్ క్లస్టర్ల ఏర్పాటు, పవర్ లూమ్స్‌ మరియు పరికరాలపై 90 శాతం సబ్సిడీ.
- విశ్వకర్మల కోసం మంగళి, స్వర్ణకారులు, కుమ్మరి, వడ్రంగులు, కుమ్మరులకు 90 శాతం సబ్సిడీతో టూల్ కిట్ లు, పట్టణ ప్రాంతాల్లో షాప్ ల ఏర్పాటుకు భూమి
- రజక యువతకు పట్టణాల్లో లాండ్రోమేట్స్ ఏర్పాటుకు రూ.10 లక్షలు
- దోబీ ఘాట్ ల ఆధునీకరణకు ప్రతీ జిల్లాకు రూ.10 కోట్లు

publive-image publive-image publive-image

Advertisment
తాజా కథనాలు