Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఖమ్మం, కరీంనగర్ ఎంపీ అభ్యర్థులు వీరే?

పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్ ఎంపీ అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖమ్మం-పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్-ప్రవీణ్ రెడ్డి పేర్లను హైకమాండ్ ఫైనల్ చేసినట్లు సమాచారం. తుక్కుగూడ సభ తర్వాత ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

New Update
AP Congress: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. అభ్యర్థుల మార్పు!

Congress MP Candidates: తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఖమ్మం (Khammam), కరీంనగర్ (Karimnagar) , హైదరాబాద్ టికెట్లను మాత్రం పెండింగ్ లో ఉంచింది. ఖమ్మం టికెట్‌ కోసం కాంగ్రెస్‌లో కుస్తీ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆ పార్టీ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ టికెట్ కోసం రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. ఇప్పటికే ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యులకే టికెట్ ఇప్పించుకోవాలని పోటీ పడుతున్నారు. తన తమ్ముడు ప్రసాద్‌రెడ్డికే టికెట్ ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) పట్టుపడుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన భార్య నందినికి టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు.
ఇది కూడా చదవండి: Cyber Crime: కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులకు సైబర్‌ నేరగాళ్ల వల..టికెట్ కోసం డబ్బులివ్వాలని ఫోన్లు

జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగేంధర్ కు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మధ్యలో పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ (V Hanumantha Rao) కూడా తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. వీరిలో ఎవ్వరూ వెనక్కి తగ్గకపోవడంతో ఈ సీటను హైకమాండ్‌ పెండింగ్ లో పెట్టింది. అయితే.. పొంగులేటి తమ్ముడు ప్రసాద్‌రెడ్డి వైపే హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తుక్కుగూడ సభ తర్వాత ఈ మేరకు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
కరీంనగర్ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి ఎంపికపై కూడా ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బండి సంజయ్, వినోద్‌ కుమార్‌ను ఢీ కొట్టే క్యాండిడేట్ కోసం ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక్కడ బీసీ, రెడ్డి, వెలమ నేతల తీవ్రమైన పోటీ నెలకొంది. టికెట్ కోసం అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండగా.. సర్వేల తర్వాత ప్రవీణ్‌రెడ్డికే టికెట్‌ ఇవ్వాలని పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తుక్కుగూడ సభ తర్వాత వీరి పేరును అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.

Advertisment
తాజా కథనాలు