Alleti Maheshwar Reddy: ధాన్యం కొనుగోళ్లు జరిగితే కల్లాల్లో ధాన్యం రాశులు ఎందుకున్నాయని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సన్న వడ్లకే బోనస్ ఇస్తామనటం ప్రభుత్వ మోసం అని ఫైర్ అయ్యారు. పోలింగ్ తర్వాత 5 ఎకరాలకే రైతుబంధు ఇస్తామనడం మోసం కాదా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కౌలు రైతులకు ఇస్తామన్న రూ.12 వేలు ఇవ్వలేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో రూ. కోట్లలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
ALSO READ: 40 మంది మంత్రులు ఓడిపోతున్నారు.. దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు
ధాన్యం కొనుగోలు అవినీతిని త్వరలో బయటపెడతాం అని అన్నారు. మంత్రి ఉత్తమ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాతో ఉన్నదెవరో సమయం వచ్చినప్పుడు చెప్తాం అని అన్నారు.