/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/VEMULA-VEERESHAM.jpg)
MLA Veeresham:మినిస్టర్స్ క్వాటర్స్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, బత్తుల లక్ష్మారెడ్డి కలిశారు. ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే వేముల వీరేశం సీరియస్ అయ్యారు. రాచకొండ కమిషనర్ తో పాటు ఇతర అధికారులు కావాలని తనను అవమానించారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. గత నెల 30న మంత్రులకు స్వాగతం పలికేందుకు ఇతర ఎమ్మెల్యేలతో పాటు తనను అనుమతించకుండా.. హక్కులకు భంగం కలిగించారన్నారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వీరేశం. వేములకు మద్దతుగా ఎమ్మెల్యేలు కవ్వంపల్లి,బత్తుల లక్ష్మారెడ్డి వచ్చారు.
మినిస్టర్స్ క్వాటర్స్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, బత్తుల లక్ష్మారెడ్డి.@GaddamPrasadKu1@INCTelangana#latestupdates#RTVpic.twitter.com/ddJt18Y8bX
— RTV (@RTVnewsnetwork) September 4, 2024