టీడీపీ భ్రష్టు పట్టించింది..ఇదేం శాడిజం అంటూ జగ్గారెడ్డి ఫైర్!

తన రాజకీయ ప్రయాణం రాహుల్‌గాంధీతోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సోషల్‌మీడియా వాడడంలో టీడీపీ దిట్ట అని.. ఆ కల్చర్‌ కాంగ్రెస్‌ని భ్రష్టు పట్టించిందన్నారు. జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా మంత్రులను, సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు జగ్గారెడ్డి.

టీడీపీ భ్రష్టు పట్టించింది..ఇదేం శాడిజం అంటూ జగ్గారెడ్డి ఫైర్!
New Update

సోషల్‌మీడియా వాడడంలో టీడీపీ దిట్ట అని చంద్రబాబు పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. టీడీపీ కల్చర్ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తుందన్నారు. తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్‌ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ సభలు సక్సెస్ చేసినా నేను పార్టీ మారుతారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారడం లేదని ఫైర్ అయ్యారు. పార్టీ అన్ని కార్యక్రమాలకు తమకు సమాచారం వస్తుందన్నారు.

జగ్గారెడ్డి ఏం అన్నారంటే?

‣ నా క్యారెక్టర్‌ను డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదు.

‣ ఎంతో కష్టపడి రాజకీయాల్లో ఎదిగా.

‣ నన్ను బీఆర్ఎస్ లోకి తీసుకోవద్దని హరీశ్‌రావుకు కంప్లైంట్ చేసిన వాళ్లంతా గతంలో నా దగ్గర పనిచేసినవారే.

‣ ఎమ్మెల్యేగా మంత్రులను, సీఎంను కలిస్తే తప్పేంటి?

‣ ఏడాదిన్నగా తనపై పార్టీ మారుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.

నా రాజకీయ ప్రయాణం రాహుల్ గాంధీతోనే ఉంటుంది.

‣ పార్టీ అన్ని మీటింగ్‌లకు అటెండ్ అవుతా

‣ ఉమ్మడి రాష్ట్రంలో నాకు మంత్రి పదవి ఆఫర్ వస్తే..మా జిల్ల లో దామోదర, గీతారెడ్డి, సునీత ఉండడంతో నేనే వద్దన్నాను.

కాంగ్రెస్‌లో కొట్లాటలు, పంచాయతీలు కామన్..

‣ మేము మేము కొట్లాడుకుంటాం , బయటి వాడు వస్తే అంతు తేలుస్తాం.

‣ సమైక్య రాష్ట్రంలో కేసీఆర్ పై తిరగడ్డ ఓకే ఓక వ్యక్తి ని నేను.

‣ తిరగబడడం నాకు కొత్త కాదు

‣ కేసీఆర్ లాంటి సునామీకే నేను ఎదురువెళ్లాను.

‣ నా బలాన్ని ఎవరూ తక్కువ అంచనా వేస్తారా?

‣ తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది

‣ కాంగ్రెస్‌లో 50 నియోజకవర్గాల్లో గెలిచే నేతలు ఉన్నారు.. కానీ కొంత ఆర్థిక సాయం అవసరం

‣ ఒకప్పుడు టీఆర్ఎస్ కూడా అప్లికేషన్‌లకు రుసుము పెట్టింది.

‣ హరీశ్‌రావుకు అవగాహన లేక మతి మరుపుతో మాట్లాడుతున్నాడు.

‣ అప్లికేషన్‌కు రుసుము పెట్టడం తప్పుకాదు.

‣ కాంగ్రెస్‌లో తాను ఉండకూడదని భావిస్తున్నారా?

‣ ఎన్నికలు రాగానే మళ్లీ పార్టీ మారుతున్నట్లు ఎందుకు పోస్టులు పెడుతున్నారు?

క్లారిటీ వచ్చినట్టేనా?
కొన్ని రోజులుగా జగ్గారెడ్డి పార్టీ మారుతారంటూ సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రచారం చేసిన వాళ్లలో కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇక బీఆర్‌ఎస్‌ మంత్రులతో జగ్గారెడ్డి ఇటివల క్లోజ్‌గా ఉన్నట్టు కనిపించారు. అంతేకాదు పార్టీ కార్యక్రమాలకు కూడా జగ్గారెడ్డి దూరంగా ఉంటున్నారన్న ప్రచారముంది. అయితే వీటన్నిటిని ఖండించారు జగ్గారెడ్డి. రాహుల్‌గాంధీతోనే తన ప్రయాణమని స్పష్టం చేశారు.

#jaggareddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe