Peddapalli: పెద్దపల్లి జిల్లాలో ఓ రైస్ మిల్లులో అత్యాచారానికి, హత్యకు గురైనా బాలిక కుటుంబాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మేల్యే రాజ్ ఠాకూర్ గారు ఓదార్చారు.
బాలికపై ఆఘాయిత్యానికి పాల్పడిన నేరస్తుడిని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరలోనే కఠినమైన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటుందని భరోసా కల్పించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేస్తామన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, రాజ్ సింగ్ ఠాకూర్ లతో కలసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు పురోగతి వివరాలను తెలుసుకున్నారు.
డ్రగ్స్, గంజాయి మత్తులోనే ఇలాంటి ఘాతుకాలు జరుగున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి.. పడుకున్న పాపను ఎత్తుకపోయి రేప్ చేసి చంపడం కలచి వేసిందన్నారు. హైదరాబాద్ లో సింగరేణి కాలనీలో గతంలో చిన్నారిని రేప్ చేసి చంపేసిన ఘటనకూ గంజాయి, మత్తు పదార్దాలే కారణమన్నారు.