Neelam Madhu: నీలం మధుకు నో బీఫామ్?.. టికెట్ మారుస్తారా?

కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థిని మార్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు నీలం మధుకు బీఫామ్ అందించకపోడమే ఇందుకు కారణం. అయితే.. ఈ రోజు సాయంత్రంలోగా ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

New Update
Neelam Madhu: నీలం మధుకు నో బీఫామ్?.. టికెట్ మారుస్తారా?

పటాన్‌చెరు కాంగ్రెస్‌ సీటుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నీలం మధుకు (Neelam Madhu) టికెట్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇంత వరకు అతనికి బీఫామ్ ఇవ్వకపోడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఒత్తిడితోనే నీలం మధుకు బీఫామ్ ను ఇంత వరకు ఇవ్వలేదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన కాట శ్రీనివాస్‌గౌడ్‌కే బీఫామ్‌ ఇవ్వాలని దామోదర పట్టుబడుతున్నారు. దీంతో పటాన్ చెరు అభ్యర్థిని కాంగ్రెస్ మార్చే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే, తనకే బీఫామ్‌ వస్తుందంని నీలం మధు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రంలోగా ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి:Telangana: ఈరోజే పొలిటికల్ స్టార్ల నామినేషన్.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు, ఈటల

అయితే.. నీలం మధుకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. టికెట్ మారిస్తే ఊరుకునేది లేదని ఆయన హైకమాండ్ కు స్పష్టం చేస్తున్నారు. నీలం మధుకు కాదని వేరే వారికి టికెట్ ఇస్తే నా దారి నేను చూసుకుంటానని హైకమాండ్ కు ఆయన ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ టికెట్ అంశంపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఉత్కంఠగా మారింది.

Advertisment
తాజా కథనాలు