Vijaya Shanthi: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సోనియా గాంధీ ఎలా హాజరవుతారు అని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సోనియాను ఆహ్వానించడాన్ని ప్రశ్నించే అర్హత బీజేపీ లేదని, ఈ కార్యక్రమానికి వచ్చే అర్హత సోనియా గాంధీకి ఉందని అన్నారు.
విజయశాంతి ట్విట్టర్ (X)లో.." ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రకటించి మాట తప్పి, తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ బాధ్యత తీసుకోక విడిచిపెట్టిన నాడు, UPA భాగస్వామ్య పక్షాలన్నింటిని ఒప్పించి, కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం జరిగినా తెలంగాణ ఏర్పాటుకు సోనియా గాంధీ చేసిన త్యాగం తెలంగాణ ఉద్యమకారులు గౌరవించి తీరుతరు ఎన్నడైనా... ఆ సోనియా గాంధీ గారు, రేపటి జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమంకు ఎట్ల హాజరు అయితరు అని బీజేపీ నేత కిషన్ రెడ్డి గారు అడిగితే, అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో నాటి బీజేపీ ప్రమేయం ఎక్కడున్నది (ప్రత్యామ్నాయం లేక పార్లమెంటుల బిల్లుకు ఓటు వేసిన నాడు తప్ప) అని కూడా తెలంగాణ సమాజం, ఉద్యమకారులు అడిగితీరుతరు... గౌరవనీయ కిషన్ రెడ్డి గారు... సోనియాగాంధీ గారికి ఆ అర్హత సంపూర్ణంగా ఉంది. అడిగే అర్హత బీజేపీ కి నిజానికి నిజాయితీగా ఐతే లేదన్నది కాదనలేని వాస్తవం...అదంతే" అంటూ రాసుకొచ్చారు.