బీఆర్ఎస్ ను వీడి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Sreenivas Reddy) ఆ పార్టీలో కీలకంగా మారారు. పార్టీలో చేరే సమయంలో ఆయన తనతో పాటు అనుచరులకు కలిపి మొత్తం పది టికెట్లను డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఓ దశలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధిర తప్పా.. మిగతా అన్ని నియోజకవర్గాలను తన వర్గీయులకే ఇవ్వాలని కండిషన్ కూడా పెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే.. తాజాగా పొంగులేటి కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మరో కొత్త ప్రతిపాదన పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. మొత్తం 13 నియోజకవర్గాల్లో తాను సూచించిన వారికి టికెట్ ఇవ్వాలని పొంగులేటి కోరారని తెలుస్తోంది. ఆ నియోజకవర్గాల్లో తాను సూచించిన వారికి టికెట్ ఇస్తే వారిని గెలిపించి గిఫ్ట్ గా ఇస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే.. కాంగ్రెస్ హైకమాండ్ పొంగులేటి ప్రతిపాదనకు ఎలా స్పందిస్తుందనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది. పొంగులేటి టికెట్ అడిగిన వారిలో కేవలం తన వెంట వచ్చిన వారే కాకుండా.. అంతకు ముందు నుంచే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారు కూడా ఉన్నారు. పార్టీలో తన పట్టును మరింతగా పెంచుకునే వ్యూహంలో భాగంగానే ఆయన ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ హైకమాండ్ ముందు ఉంచారన్న టాక్ కూడా నడుస్తోంది. అయితే పొంగులేటి ఇచ్చిన లిస్ట్ లో టికెట్ ఎంత మందికి దక్కుతుందో తెలియాలంటే కాంగ్రెస్ పార్టీ లిస్ట్ విడుదల చేసే వరకు ఆగాల్సిందే!
పొంగులేటి సూచించిన అభ్యర్థులు వీరే!
1) పినపాక - పాయం వెంకటేశ్వర్లు
2) ఇల్లందు - కోరం కనకయ్య
3) అశ్వారావుపేట - జారె ఆదినారాయణ
4) వైరా - విజయా భాయ్
5) సత్తుపల్లి - కొండూరు సుధాకర్
ఇది కూడా చదవండి: Motkupalli Meets DK Shivakumar: కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌తో మోత్కుపల్లి భేటీ.. లైన్ క్లియర్ అయినట్లేనా?
6) ఖమ్మం/కొత్తగూడెం/పాలేరు-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
7) మహబూబాబాద్ - మురళీ నాయక్
8) డోర్నకల్ - రాంచందర్ నాయక్
9) శేరిలింగంపల్లి - రఘునాథ్ యాదవ్
10) చెన్నూరు - డా. రాజా రమేష్
11) పాలకుర్తి - ఝాన్సీ రెడ్డి
12) కంటోన్మెంట్ - పిడమర్తి రవి
13) సూర్యాపేట - పటేల్ రమేష్ రెడ్డి