గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టం నిర్వహిస్తోంది. ఇందుకోసం సీనియర్ నేత కురియన్ నేతృత్వంలో హైకమాండ్ ఏర్పాటు చేసిన ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ గాంధీ భవన్ లో అభ్యర్థులు, ముఖ్య నేతలతో రెండు రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఈ కమిటీ ఎదుట హాజరైన సీనియర్ నేత, నాంపల్లి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన ఫిరోజ్‌ఖాన్ ఊహించని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Telangana Congress: ఎంఐఎంతో రహస్య పొత్తుతోనే నష్టపోయాం.. బాంబ్ పేల్చిన ఫిరోజ్ ఖాన్!
ఎంఐఎంతో రహస్య పొత్తు కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మెదక్ ఎంపీ సీట్లలో కాంగ్రెస్ ను దెబ్బతీసిందని ఫిరోజ్ ఖాన్ బాంబ్ పేల్చారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ ఎదుట చెప్పి పార్టీలో ప్రకంపనలు సృష్టించారు
Translate this News: