New TPCC Chief: తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్.. తెరపైకి వైఎస్-డీఎస్ ఫార్ములా!

తెలంగాణకు కొత్త పీసీసీ ఛీఫ్ నియామకంపై జోరుగా చర్చ సాగుతున్న వేళ.. వైఎస్-డీఎస్ ఫార్ములా కాంగ్రెస్ లో మరో సారి తెరపైకి వచ్చింది. ఈ ఫార్ములా ఏంటి? దీని ప్రకారం ఎవరు పీసీసీ చీఫ్ అయ్యే అవకాశం ఉంది? అన్న విషయాలపై విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New TPCC Chief: తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్.. తెరపైకి వైఎస్-డీఎస్ ఫార్ములా!
New Update

తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ రావడం ఖాయమైంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని తాను హైకమాండ్ ను కోరినట్లు కొద్ది రోజుల క్రితం ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్.. పీసీసీ చీఫ్‌ ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ అగ్రనేతలతో చర్చిస్తున్నారు. అయితే.. గతంలోనూ ఈ విషయమై ఆయన అనేక సార్లు ఢిల్లీకి వచ్చి పార్టీ పెద్దలతో చర్చలు జరిపినా.. ఏకాభిప్రాయం రాకపోవడంతో పేర్లు ఖరారు కాలేదు. అయితే.. ఈ సారి మాత్రం ఫైనల్ లిస్ట్ తోనే ఆయన రాష్ట్రానికి వస్తారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ కాస్త ఆలస్యమైనా కూడా.. పీసీసీ చీఫ్‌ నియామకం మాత్రం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్‌ ఎవరు? అన్న అంశంపై పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

వైఎస్-డీఎస్ ఫార్ములా..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డీ శ్రీనివాస్ ది ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ పాలిటిక్స్ లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా చెబుతుంటారు. వైఎస్ సీఎల్పీ నేతగా ఉన్న సమయంలో డీ శ్రీనివాస్ ను కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్‌ గా హైకమాండ్ నియమించింది. ఆ సమయంలో జరిగిన 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అనంతరం 2009లోనూ వైఎస్ సీఎంగా.. డీఎస్ పీసీసీ చీఫ్ గా ఉన్నారు. ఆ ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధించి రెండోసారి అధికారం దక్కించుకుంది. అయితే.. వైఎస్ ను కంట్రోల్ చేయడం కోసమే ఆయనను విభేదించే డీఎస్ ను పీసీసీ చీఫ్‌ గా పెట్టారన్న ప్రచారం ఉంది. రెడ్డి సమాజిక వర్గానికి చెందిన వెఎస్ సీఎల్పీ నేత/సీఎంగా ఉండడంతో బలమైన బీసీ నేత అయిన డీఎస్ కు అవకాశం ఇచ్చారన్న మరో వాదన కూడా పార్టీలో ఉంది.

అయితే.. తెలంగాణలో కొత్త పీసీసీ చీఫ్ పై చర్చ జరుగుతున్న ఈ సమయంలో వైఎస్, డీఎస్ ఫార్ములా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఫార్ములా ఫాలో కావాలని హైకమాండ్ భావిస్తే.. సీఎంగా రెడ్డి సమాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండడంతో బీసీని పీసీసీ చీఫ్‌ గా నియమించే అవకాశం ఉందన్న టాక్ నడుస్తోంది. అదే జరిగితే మధుయాష్కీ, మహేష్‌ కుమార్ గౌడ్ పేర్లను హైకమాండ్ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. పొన్నం ప్రభాకర్ కూడా బీసీ కోటాలో పీసీసీ చీఫ్‌ పదవి రేస్ లో ఉన్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో బీసీని పీసీసీ చీఫ్‌ గా నియమించాలని హైకమాండ్ డిసైడ్ అయితే.. ఈ ముగ్గురిలో ఒకరికి పక్కాగా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది.

మధుయాష్కీ, సీఎం రేవంత్ మధ్య అంతగా సఖ్యత లేదన్న ప్రచారం ఉంది. దీంతో ఆయన పేరును రేవంత్ ఒప్పుకోకపోవచ్చన్న టాక్ కాంగ్రెస్ లో వినిపిస్తోంది. రేవంత్ ను కంట్రోల్ చేయాలని భావిస్తే మాత్రం హైకమాండ్ మధుయాష్కీ వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది. అలా కాకుండా పార్టీలోనూ రేవంత్ కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని డిసైడ్ అయితే.. ఆయన చెప్పిన వ్యక్తికే పీసీసీ చీఫ్‌ పదవిని కట్టబెట్టే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే.. రేవంత్ మహేశ్ కుమార్ గౌడ్ పేరును సూచించే అవకాశం ఉందన్న చర్చ పార్టీలో సాగుతోంది.

రేసులో బలరాం నాయక్, అడ్లూరి లక్ష్మణ్, సంపత్ కూడా..

మరో వైపు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్‌, సంపత్, ఎస్టీ కోటాలో బలరాం నాయక్ కూడా పీసీసీ చీఫ్‌ రేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురికి కూడా రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో వీరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ భావించినా.. రేవంత్ ఓకే అంటారన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఈ సారి ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి పీసీసీ చీఫ్‌ ను ఎంపిక చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆలోచిస్తే ఈ ముగ్గురిలో ఒకరికి పక్కాగా ఛాన్స్ దక్కే అవకాశం ఉందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe