/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/TS-Elections-3-jpg.webp)
రానున్న తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections 2023) ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని భావిస్తోన్న కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఇచ్చిన తమకు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్ననినాదంతో ప్రచారాన్ని హోరెత్తించాలని హైకమాండ్ భావిస్తోంది. ఇంకా.. ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), సోనియా గాంధీ తెలంగాణలో మకాం వేయనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి రానున్నారు.
ఇది కూడా చదవండి:TS BJP Manifesto: ప్రతీ మహిళకు రూ.12 వేలు.. వ్యవసాయ కార్మికులకు రూ.20 వేలు.. బీజేపీ సంచలన మేనిఫెస్టో ఇదే?
ఇదే రోజున పాలకుర్తి, వరంగల్, భువనగిరి సభల్లో ఆయన పాల్గొంటారు. రేపటిలోగా ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటనలు ఖరారు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో వివిధ తేదీల్లో ఆరు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో వీరు పాల్గొననున్నారు. సోనియా గాంధీ పర్యటనకు సంబంధించి వివరాలను త్వరలో విడుదల చేయనుంది కాంగ్రాస్ పార్టీ. రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా.. కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లనుంది.
తెలంగాణ మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రచారం తుది దశకు చేరుకోనుంది. ఆ రాష్ట్రాల్లో ప్రచారం తర్వాత తెలంగాణపైనే ఫుల్ ఫోకస్ పెట్టనుంది హస్తం పార్టీ హైకమాండ్. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడూ ఆరా తీస్తోంది హైకమాండ్. తద్వారా రాష్ట్ర నేతలకు సూచనలు చేస్తోందని సమాచారం.