Telangana Congress: ఎందుకు ఓడారు.. కాంగ్రెస్ అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ!

మీరు ఎందుకు ఓడి పోయారు? స్థానిక నేతల నుంచి సరైన సహకారం అందిందా? క్రాస్ ఓటింగ్ ఏమైనా జరిగిందా? అన్న వివరాలపై కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ అభ్యర్థుల నుంచి ఈ రోజు వివరాలను సేకరించింది. రేపు గెలిచిన అభ్యర్థులతో కమిటీ భేటీ కానుంది.

Telangana Congress: ఎందుకు ఓడారు.. కాంగ్రెస్ అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ!
New Update

పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై కాంగ్రెస్‌ పోస్ట్‌మార్టం నిర్వహిస్తోంది. పదికి పైగా స్థానాలు వస్తాయని ఆశించిన కాంగ్రెస్ పార్టీ కేవలం 8 సీట్లకే పరిమితం కావడం ఏంటి? అన్న అంశంపై వివరాలను సేకరించడంపై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం AICC ఏర్పాటు చేసిన కురియన్‌ కమిటీ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కోసం ఈ రోజు హైదరాబాద్ లో అభ్యర్థులు, నేతలతో భేటీ అవుతోంది. హైదరాబాద్‌ సీటుతో పాటు బీజేపీ గెలిచిన 8 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ ఓటమిపై నేతల అభిప్రాయలను కమిటీ తీసుకుంది. మొదట ఓడిన అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ అయ్యింది.

నేతల మధ్య సమన్వయం, కార్యకర్తల సహకారం తదితర వివరాలను అడిగి తెలుసుకుంది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం, క్రాస్ ఓటింగ్‌ పై లెక్కలను అడిగి తెలుుకుంది. లోపం ఎక్కడ జరిగిందన్న అంశాలపై అభిప్రాయ సేకరణ చేసింది. కమిటీ సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ నేత వీహెచ్ కలిసి మాట్లాడారు. గెలిచిన అభ్యర్థులతో నూ కమిటీ కలిసి మాట్లాడనుంది. వారి గెలుపులో కీలక పాత్ర పోషించిన అంశాలపై ఆరా తీయనుంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe