బీజేపీ, కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లోకి కీలక నేతలు

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అలాగే, బీజేపీ నుంచి సంగారెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డ దేశ్ పాండే ఇవాళ బీజేపీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరారు.

జమ్మలమడుగులో హైటెన్షన్‌.. నేతలకు భారీగా భద్రత పెంపు!
New Update

Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. వరుస రాజీనామాలతో బీజేపీకి ఊహించని షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. గత కొన్ని రోజులుగా పార్టీలో అసంతృప్తిగా ఉన్న విజయశాంతి (Vijaya Shanti) నిన్న (బుధవారం) బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. రేపు రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలోచేరుతున్నట్లు సమాచారం. విజయశాంతి రాజీనామా విషయం నుంచి బయటపడే లోపే మరో బీజేపీ నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ALSO READ: ఆడపిల్ల పుడితే రూ.2 లక్షలు, విద్యార్థినులకు ఉచిత స్కూటీ..

బీజేపీ నుంచి సంగారెడ్డి టికెట్ ఆశించారు దేశ్‌పాండే రాజేశ్వర్‌రావు (Deshpande Rajeshwar Rao). అయితే అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో భంగపడ్డ ఆయన ఇవాళ తన ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. ఇవాళ నర్సపూర్ బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు.

ALSO READ: నన్ను సీఎం అనకండి ప్లీజ్.. బండి సంజయ్ రిక్వెస్ట్!

ఇదిలా ఉండగా కాంగ్రెస్ నర్సాపూర్ టికెట్ ఆశించి భంగపడ్డ గాలి అనిల్ కుమార్ రెడ్డి (Gali Anil Kumar ReddY) తన టీపీసీసీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మల్లిఖార్జున ఖర్గేకు పంపారు. ఇవాళ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

#telangana-election-2023 #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe