Telangana: 6 గ్యారెంటీల దరఖాస్తుకు ఇవి తప్పనిసరి..!

తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీ స్కీమ్‌లకు గురువారం నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ దరఖాస్తు కోసం గ్యాస్ బుక్, భూమి పట్టా పాస్ బుక్, కరెంట్ బిల్, ఆధార్, సదరం సర్టిఫికెట్‌, ఉపాధి హామీ కార్డు జీరాక్స్ తప్పనిసరిగా అవసరం.

Telangana: 6 గ్యారెంటీల దరఖాస్తుకు ఇవి తప్పనిసరి..!
New Update

Telangana Govt Schemes: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీల పథకాలకు గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే.. లబ్ధిదారులు కొన్ని డాక్యూమెంట్స్ తప్పక తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరి ఆరు గ్యారెంటీ పథకాల దరఖాస్తునకు ఏయే సర్టిఫికెట్స్ అవసరమో ఓసారి చూద్దాం.

గురువారం నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు అధికారులు. అయితే, ఈ దరఖాస్తు కోసం లబ్ధిదారులు తమ ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

ఏ పథకానికి ఏం కావాలంటే..

👉 ఫ్రీ సిలిండర్ స్కీమ్ కోసం గ్యాస్ బుక్ ఫ్రంట్ పేజీ జీరాక్స్ తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది.

👉 200 యూనిట్లు ఫ్రీ కరెంట్‌ కోసం మీటర్ కనెక్షన్‌ నంబర్‌/కరెంటు బిల్లు ఉండాలి.

👉 కొత్తగా వికలాంగుల పింఛను కోసం దరఖాస్తు చేయాలంటే సదరం సర్టిఫికెట్‌ తప్పనిసరి.

👉 రైతు భరోసా కోసం అప్లై చేయాలంటే పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్‌లు ఉండాల్సిందే.

👉 వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ కార్డు తప్పనిసరి.

Also Read:

రైతుబంధుపై సందిగ్ధత.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన..

వైసీపీ మరో బిగ్ షాక్.. ‘గుడ్ బై’ చెప్పిన ఎమ్మెల్యే..!

#telangana-govt-schemes
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe