Telangana: 6 గ్యారెంటీల దరఖాస్తుకు ఇవి తప్పనిసరి..! తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీ స్కీమ్‌లకు గురువారం నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ దరఖాస్తు కోసం గ్యాస్ బుక్, భూమి పట్టా పాస్ బుక్, కరెంట్ బిల్, ఆధార్, సదరం సర్టిఫికెట్, ఉపాధి హామీ కార్డు జీరాక్స్ తప్పనిసరిగా అవసరం. By Shiva.K 27 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Govt Schemes: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీల పథకాలకు గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే.. లబ్ధిదారులు కొన్ని డాక్యూమెంట్స్ తప్పక తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరి ఆరు గ్యారెంటీ పథకాల దరఖాస్తునకు ఏయే సర్టిఫికెట్స్ అవసరమో ఓసారి చూద్దాం. గురువారం నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు అధికారులు. అయితే, ఈ దరఖాస్తు కోసం లబ్ధిదారులు తమ ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఏ పథకానికి ఏం కావాలంటే.. 👉 ఫ్రీ సిలిండర్ స్కీమ్ కోసం గ్యాస్ బుక్ ఫ్రంట్ పేజీ జీరాక్స్ తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. 👉 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ కోసం మీటర్ కనెక్షన్ నంబర్/కరెంటు బిల్లు ఉండాలి. 👉 కొత్తగా వికలాంగుల పింఛను కోసం దరఖాస్తు చేయాలంటే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. 👉 రైతు భరోసా కోసం అప్లై చేయాలంటే పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్‌లు ఉండాల్సిందే. 👉 వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ కార్డు తప్పనిసరి. Also Read: రైతుబంధుపై సందిగ్ధత.. సీఎం రేవంత్ కీలక ప్రకటన.. వైసీపీ మరో బిగ్ షాక్.. ‘గుడ్ బై’ చెప్పిన ఎమ్మెల్యే..! #telangana-govt-schemes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి