గురువుకి అభినందనలు తెలిపిన అభిషేక్ శర్మ!

వరల్డ్ లెజెండ్స్ ట్రోఫీ ఫైనల్ లో పాక్ పై భారత్ గెలవటంతో ఆటగాళ్లకు ఇంటర్నెట్ లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే భారత్ యువ ఆటగాడు అభిషేక్ యువరాజ్ సింగ్ పై ప్రశంసలు కురిపించాడు.తన గురువుగారికి ప్రత్యేక అభినందనలు మీరు గెలవటం మేమంతా చూశామని ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

New Update
గురువుకి అభినందనలు తెలిపిన అభిషేక్ శర్మ!

జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో యువ ప్లేయర్ అభిషేక్ శర్మ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైన అభిషేక్ శర్మ.. రెండో మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. దీంతో అభిషేక్ శర్మ జట్టులో తన స్థానాన్ని కొనసాగించగలిగాడు కానీ అతను ఓపెనర్‌గా రాలేకపోయాడు.జైస్వాల్ అరంగేట్రంతో అతడు ఫస్ట్ డౌన్ బ్యాట్సెమెన్ గా రావాల్సివచ్చింది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినా తక్కువ పరుగులకే వెనుదిరగాల్సి వచ్చింది. అభిషేక్ శర్మ స్వస్థలం పంజాబ్. ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ దగ్గర శిక్షణ కూడా తీసుకున్నాడు. క్రికెట్‌లో తన విజయానికి యువరాజ్ సింగ్ కారణమని అభిషేక్ శర్మ పలుమార్లు తెలిపాడు.

ఈ దశలో మాజీ ఆటగాళ్లు పాల్గొన్న వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ ఫైనల్స్‌లో యువరాజ్‌ సారధ్యంలో భారత ఛాంపియన్స్ పాకిస్థాన్‌ను ఓడించి వరల్డ్ లెజెండ్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ పై అభిషేక్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. పాకిస్థాన్‌తో ఎప్పుడు ఆడి గెలిచినా అది ప్రత్యేకంగా ఉంటుందని ఈ పోటీలో విజయం సాధించినందుకు నా గురువు యువరాజ్ సింగ్‌కి నా అభినందనలని అభిషేక్ తెలిపాడు. మేమంతా ఈ మ్యాచ్‌ని చూశామని అభిషేక్ తెలిపాడు.

‘జింబాబ్వేతో గత కొన్ని మ్యాచ్‌ల్లో మేం బాగా బ్యాటింగ్ చేశాం. అది మొదటి మ్యాచ్ తర్వాతే తెలిసింది. వరుస మ్యాచ్‌లు ఉన్నందున మేం పెద్దగా ఆలోచించలేదు. ఐపీఎల్ సిరీస్ సందర్భంగా భారత జట్టు తరఫున ఒక్కసారైనా ఆడాలనేది కల. ఇప్పుడు ఆ కల సాకారమైంది. గిల్, కోచ్ లక్ష్మణ్ కు మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నా బౌలింగ్‌పై భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు నమ్మకం ఉంది. నా బౌలింగ్‌పై దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాను' అని అభిషేక్ శర్మ తెలిపాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు