కర్నాటక అసెంబ్లీ గందరగోళంగా మారింది. అసెంబ్లీ నుంచి పది మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సభలో అమర్యాదగా, అసభ్యకరంగా ప్రవర్తించినందుకు 10మంది బీజేపీ ఎమ్మెల్యేలను డిప్యూటీ స్పీకర్ సస్పెండ్ చేశారు. అంతేకాదు వారిని మార్షెల్స్ సహాయంతో బయటకు గెంటెపించారు. దీంతో వారంతా అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేపట్టారు. జూలై 21న బడ్జెట్ సెషన్ ముగిసే వరకు అరవింద్ బెల్లాడ్, భరత్ శెట్టి, యశ్‌పాల్ సువర్ణ, ఉమానాథ్ కొట్యాన్, వేదవ్యాస కామత్, ధీరజ్ మునిరాజులను సస్పెండ్ చేశారు డిప్యూటీ స్పీకర్.
పూర్తిగా చదవండి..Karnataka Assembly : ఇది అసెంబ్లీనా ఫిష్ మార్కెటా.. గెట్ అవుట్..అసలేం జరిగిందంటే..?
కర్నాటక అసెంబ్లీలో బుధవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బెంగళూరులో జరిగిన విపక్షాల భేటీ కోసం ఐఏఎస్ అధికారుల సేవలను కాంగ్రెస్ వాడుకుందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళవాతావరణం నెలకొంది.

Translate this News: