Karnataka Assembly : ఇది అసెంబ్లీనా ఫిష్ మార్కెటా.. గెట్ అవుట్..అసలేం జరిగిందంటే..? కర్నాటక అసెంబ్లీలో బుధవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బెంగళూరులో జరిగిన విపక్షాల భేటీ కోసం ఐఏఎస్ అధికారుల సేవలను కాంగ్రెస్ వాడుకుందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళవాతావరణం నెలకొంది. By Bhoomi 20 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి కర్నాటక అసెంబ్లీ గందరగోళంగా మారింది. అసెంబ్లీ నుంచి పది మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సభలో అమర్యాదగా, అసభ్యకరంగా ప్రవర్తించినందుకు 10మంది బీజేపీ ఎమ్మెల్యేలను డిప్యూటీ స్పీకర్ సస్పెండ్ చేశారు. అంతేకాదు వారిని మార్షెల్స్ సహాయంతో బయటకు గెంటెపించారు. దీంతో వారంతా అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేపట్టారు. జూలై 21న బడ్జెట్ సెషన్ ముగిసే వరకు అరవింద్ బెల్లాడ్, భరత్ శెట్టి, యశ్‌పాల్ సువర్ణ, ఉమానాథ్ కొట్యాన్, వేదవ్యాస కామత్, ధీరజ్ మునిరాజులను సస్పెండ్ చేశారు డిప్యూటీ స్పీకర్. రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను దుర్వినియోగం చేస్తున్నారంటూ నిరసిస్తూ బీజేపీకి చెందిన కొంతమంది సభ్యులు బిల్లుల అజెండా కాపీలను చించారు. వాటిని స్పీకర్ పైకి విసిరేశారు. అదేసమయంలో మధ్యాహ్న భోజన విరామం లేకుండా ప్రొసీడింగ్స్ నిర్వహించడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బెంగళూరులో మంగళవారం ముగిసిన రెండు రోజుల ప్రతిపక్ష పార్టీ ఐక్యతా సమావేశానికి ఐఏఎస్ అధికారులను నియమించారు. దీనిని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శాంతిభద్రతలపార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి హెచ్ కే పాటిల్ 10మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక డిప్యూటీ స్పీకర్ పై బీజేపీ ఎమ్మెల్యేలు కాగితాలు విసరడంతో సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మార్షల్స్ ఆయనను చుట్టుముట్టారు. రక్షణ వలయంగా నిలిచారు. పోడియం ముందు బీజేపీ ఎమ్మెల్యేలు దూసుకువచ్చి రచ్చ రచ్చ చేశారు. దీంతో వారిని సస్పెండ్ చేశారు. జూలై 21న సెషన్ ముగిసే వరకు సభ్యులను సస్పెండ్ చేయాలని చట్టం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ ప్రతిపాదించారు. సస్పెన్షన్ అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు సభా ప్రాంగణంలోనే ఆందోళన కొనసాగడంతో నాటకీయ దృశ్యాలు చోటు చేసుకున్నాయి. శాసనసభ్యులను తొలగించేందుకు మార్షల్స్ వెల్ లోకి ప్రవేశించగా, అక్కడ ఉన్న బిజెపి ఎమ్మెల్యేల బృందం ప్రతిఘటించడంతో సస్పెండ్ అయిన శాసనసభ్యులను తొలగించడం కష్టమైంది. దీంతో దాదాపు 10-15 నిమిషాల పాటు తోపులాట జరిగింది. శాసనసభ్యులను తొలగిస్తున్న సమయంలో జరిగిన కొట్లాటలో, కొందరు మార్షల్స్ పొరపాటున సిద్దూ సవాడిని పైకి లేపి బయటకు తీసుకువెళుతుండగా, సస్పెండ్ చేసిన వారిలో ఎమ్మెల్యే లేకపోవడంతో వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఐదు బిల్లులను ఆమోదించగా, మధ్యాహ్న భోజనానికి సభను వాయిదా వేయకుండా బడ్జెట్‌పై చర్చ చేపట్టాలని స్పీకర్ యూటీ ఖాదర్ నిర్ణయించారు. మధ్యాహ్న భోజనానికి అసెంబ్లీని వాయిదా వేయడంలో జరిగిన జాప్యం బిజెపి శాసనసభ్యులను మరింత ఆగ్రహానికి గురి చేసింది, వారు తమ నిరసనను మరింత తీవ్రతరం చేశారు. ఖాదర్ విరామం తీసుకున్న తర్వాత స్పీకర్ కుర్చీలో కూర్చున్న లమాని విపక్షాల ఆగ్రహానికి గురయ్యారు. కొంతమంది బిజెపి శాసనసభ్యులు ఆమోదించిన బిల్లుల కాపీలను చించి అతనిపైకి విసిరి, ట్రెజరీ బెంచ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి