Quit firing: పొమ్మనలేక పొగబెట్టడం అంటే ఇదే..కంపెనీల క్విట్‌ ఫైరింగ్‌

ఉద్యోగులు యజమాన్యం దృష్టిలో పడాలని కష్టపడి పనిచేస్తూ ఉంటారు. పెద్ద కంపెనీలు ఉద్యోగులను తీసేయడానికి కొన్ని పద్ధతులు ఫాలో అవుతున్నాయి. కొన్ని సంస్థలు ఉద్యోగులను నేరుగా తొలగిస్తుంటే మరికొందరు పరోక్షంగా ఎసరు పెడుతున్నారు. దీనికి క్వైట్‌ ఫైరింగ్‌ అనే పేరు కూడా పెట్టారు.

Quit firing: పొమ్మనలేక పొగబెట్టడం అంటే ఇదే..కంపెనీల క్విట్‌ ఫైరింగ్‌
New Update

Quit firing: పొమ్మనకుండా పొగబెట్టడం సామెత అందరికీ తెలుసు. ఇప్పుడు కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇలానే చేస్తున్నాయి. ఉద్యోగులను పొమ్మనలేక లేనిపోని సాకులతో తీసివేతలు మొదలుపెట్టాయి. దీనికి క్విట్‌ ఫైరింగ్‌ అనే పేరు కూడా పెట్టారు. ఉద్యోగులు యజమాన్యం దృష్టిలో పడాలని కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మాత్రం అలాంటిది మర్చిపోవాల్సిందే. చేసిన పనికి ప్రశంసలు పక్కనపెట్టి తీసివేతల దిశగా బడా కంపెనీలు సాగుతున్నాయి. క్వైట్​ ఫైరింగ్ విధానంతో ఉద్యోగులను తొలగిస్తున్నారు. టెక్ రంగంలో అయితే దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఆర్థిక పరిస్థితులతో పాటు సాంకేతిక మార్పులే కారణమని నిపుణులు అంటున్నారు.

క్విట్ ఫైరింగ్ అంటే..?

చాలా పెద్ద కంపెనీలు ఉద్యోగులను తీసేయడానికి కొన్ని పద్ధతులు ఫాలో అవుతున్నాయి. కొన్ని సంస్థలు ఉద్యోగులను నేరుగా తొలగిస్తుంటే మరికొందరు పరోక్షంగా ఎసరు పెడుతున్నారు. ఎంత కష్టపడి పనిచేసినా సంస్థ గుర్తించకపోవడం, బాస్ కానీ టీమ్‌లీడర్లు దారుణంగా ప్రవర్తిస్తుంటారు. అంతేకాకుండా మానసికంగా ఒత్తిడి పెడుతుంటారు. చివరికి మనమే జాబ్‌ మానేయాలని నిర్ణయానికి వచ్చేలా చేస్తారు. దీన్నే క్విట్‌ ఫైరింగ్ అంటున్నారు. తెలుగులో చెప్పాలంటే పొమ్మనకుండా పొగబెడుతున్నారు. ఒక ఉద్యోగిని తొలగించాలనుకుంటే వారిని బాగా ఇబ్బందులకు గురిచేస్తారు. కార్యాలయంలో వసతులు తగ్గించడం, పనిలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటివి చేస్తుంటారు. పనిగంటలను పెంచుతుంటారు. మనకు తెలియని పనిని కూడా అప్పగించి చేయాలని ఒత్తిడి చేస్తుంటారు. దీంతో ఉద్యోగికి చిరాకుతో పాటు విసుగు వస్తుంటుంది. మానసికంగా ఇబ్బందులు పడతారు. చివరికి ఉద్యోగం మానేస్తాడు. ఒక టైమ్‌లో ఏదైనా పనిచేస్తే కావాలని బాస్‌లు, టీమ్‌ లీడర్లు విమర్శిస్తూ ఉంటారు. ప్రతి కదలికపై నిఘా పెట్టి చిన్న పొరపాటు దొరుకుతుందేమోనని చూస్తుంటారు. పై అధికారులు స్పందించే తీరు కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే యాజమాన్యం నుంచి ఉద్యోగులను తొలగించాలని సూచనలు రావడంతో ఇలా చేస్తుంటారని చెబుతున్నారు.

ఎందుకు ఇలా చేస్తారు..?

సంస్థలు నష్టాల్లోకి జారుకున్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. నేరుగా లేఆఫ్ చేసే ఛాన్స్‌ ఉన్నా క్విట్‌ ఫైరింగ్ వైపే మొగ్గుచూపుతారు. ఎందుకంటే ఇలా చేయాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. నేరుగా ఉద్యోగిని పంపిస్తే పరిహారాలు చెల్లించాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఉన్న బకాయిలన్నీ సెటిల్‌ చేయాల్సి ఉంటుంది. లీవ్స్, ఇంక్రీమెంట్స్ అన్ని క్లెయిమ్‌ చేయాలి. లీగల్‌గా కూడా కొన్ని సమస్యలు వస్తాయని ఈ క్వైట్ ఫైరింగ్ ఫాలో అవుతారు. కొన్ని విషయాలను బట్టి ఉద్యోగి తనపై క్విట్‌ ఫైరింగ్ ఉందని గుర్తించవచ్చు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు నిలిపివేయడం. పనిభారం పెంచడం, టైమింగ్స్‌లో మార్పులు, వసతులు, ప్రోత్సాహకాలను కుదించడం, బోనస్ ఆపడం వంటివి చేస్తే క్విట్‌ ఫైరింగ్ జరుగుతుందని గుర్తించవచ్చు. కొన్నిసార్లు ఇలాంటివి జరిగినా కంపెనీ మిమ్మల్ని తీసేస్తుందని ముందుగానే ఊహించుకోకూడదు. తొందరపడి నిర్ణయాలు వద్దని నిపుణులు అంటున్నారు. సమయం వచ్చేవరకు వేచి చూడాలని చెబుతున్నారు. చిన్న పొరపాట్లు జరిగితే సరిచేసుకుని ముందుకు సాగాలని సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: వేలంలో లక్షన్నర పలికిన నిమ్మకాయ..ఎందుకో తెలుసా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#quiet-firing
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe