CM Pellam: సీఎం వస్తున్నాడు.. పక్కకు తప్పుకోండి తమ్ముళ్లు.. 'CM పెళ్ళాం' మూవీ డీటైల్స్‌ ఇవే..!

ఈ 'CM పెళ్ళాం' (కామన్ మ్యాన్ పెళ్ళాం) సినిమా సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. మొయినాబాద్ CM ఇంటికి సంబంధించిన సన్నివేశాలను ఈ సినిమా ముహూర్తపు సన్నివేశంగా తీసి ఈరోజు(సోమవారం) ఉదయం సినిమాను అధికారికంగా ప్రారంభించారు. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగనుంది.

CM Pellam: సీఎం వస్తున్నాడు.. పక్కకు తప్పుకోండి తమ్ముళ్లు.. 'CM పెళ్ళాం' మూవీ డీటైల్స్‌ ఇవే..!
New Update

CM Pellam: వాకాడ అప్పారావు సమర్పణలో ఆర్కే సినిమాస్ బ్యానర్  పై బొల్లా రామకృష్ణ నిర్మాతగా రమణారెడ్డి కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తూ డైరెక్షన్ చేస్తున్న సినిమా 'CM పెళ్ళాం' (కామన్ మ్యాన్ పెళ్ళాం). ఈ 'CM పెళ్ళాం' (కామన్ మ్యాన్ పెళ్ళాం) సినిమా సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. మొయినాబాద్ CM ఇంటికి సంబంధించిన సన్నివేశాలను ఈ సినిమా ముహూర్తపు సన్నివేశంగా తీసి ఈరోజు(సోమవారం) ఉదయం సినిమాను అధికారికంగా ప్రారంభించారు. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగనుంది. ఇక ఈ సినిమాలో సీఎంగా అజయ్, సీఎం పెళ్లాంగా ఇంద్రజ, హోమ్ మినిస్టర్ గా సురేష్ కొండేటి నటిస్తున్నారు. ఇక సీనియర్ హీరో సుమన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమాకు  కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ అన్నీ రమణారెడ్డి బాధ్యత వహిస్తున్నారు.

Also Read: Allu Arjun - అసలు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఇదే..!!

ఈ సందర్భంగా సినిమా సమర్పకుడు వాకాడ అప్పారావు మాట్లాడుతూ R.K అనే సంస్థ ఒక కొత్త సంస్థ, బొల్లా రామకృష్ణ గారు దీనికి నిర్మాత.  రమణా రెడ్డి డైరెక్టర్ మాత్రమే కాదు స్క్రీన్ ప్లే, మ్యూజిక్ సహా అన్నీ ఆయనే చూసుకుంటున్నారు.  చాలా మంది అనుకుంటారు.. CM కి, కామన్ మ్యాన్ కి తేడా ఏమీ లేదు, ఇద్దరూ ఒకటేనని అందుకు సంబంధించిన ఒక భార్య కథే ఈ సినిమా. ఇది ఒక కొత్త సబ్జెక్ట్, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేని ఒక సబ్జెక్ట్. సమాజానికి పొలిటీషియన్స్, సాధారణ ప్రజలు ఎలా ఉపయోగపడాలి అని ఉద్దేశంతో రాసుకున్న సినిమా ఇది. ఎక్కడా నెగిటివ్ లేకుండా ముందుకు వెళుతోంది. అందరూ సినిమా చూసి ఆదరించాలి" అన్నారు.

publive-image

డైరెక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ అందరికీ నమస్కారం, ఇప్పుడే సీఎం పెళ్ళాం - అంటే కామన్ మ్యాన్ పెళ్ళాం ఇది ఒక వెరైటీ సినిమా, చూసాక ప్రేక్షకులే చెబుతారు.  డిఫరెంట్ యాంగిల్ లో పొలిటికల్ పాయింట్స్, నిజంగా ఒక పదేళ్ళ తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయి? ఎలా ఉండబోతున్నాయి? అనేది భిన్నమైన కోణంలో ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి వాకాడ అప్పారావు గారికి థాంక్స్ చెప్పాలి. కథ విన్న వెంటనే ముందుకు వచ్చారు. R.K గారు ఒక ఛానల్ పెట్టి ఎందరికో ఉపయోగపడే విధంగా ఉంటూనే మా సినిమా నిర్మించేందుకు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. సంతోషం సురేష్ గారికి సంతోషంగా థాంక్స్ చెబుతున్నా" అన్నారు.

నిర్మాత బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ మొట్టమొదటి సారిగా రమణారెడ్డి గారు నా వద్దకు వచ్చి ఈ స్టోరీ చెప్పి సినిమా చేద్దాం  అన్నప్పుడు పొలిటికల్ గా కానీ కామన్ మ్యాన్ కి గానీ  జరిగే ఇబ్బందులు చూపించాలనే ఉద్దేశంతో నిర్మాణంలో అడుగుపెడుతున్నాము  అని అన్నారు.

నటి ఇంద్రజ మాట్లాడుతూ.. సొసైటీకి చాలా  ఇంపార్టెంట్ మెసేజెస్ ఉన్న ఒక మూవీ ఇది. సోల్ ఫుల్ గా తీయాలని ప్రయత్నిస్తాం. త్వరలోనే మీ ముందుకు వస్తాం, ఇంతకు ముందు లానే మమ్మలని ఆదరించండి అని అన్నారు.

Also Read: Prabhas: ప్రభాస్ ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌ మిస్సింగ్.. హ్యాక్ అయ్యిందా..? డియాక్టివేట్‌ చేశారా..?

#movie #common-man-pellam-movie #r-k-banner
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe