![Dhan raj: ఆ డైరెక్టర్ బాటలోనే 'జబర్దస్త్' ధన్ రాజ్..!!](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/d-jpg.webp)
Comedian Dhanraj: బలగం సినిమాతో అద్భుత విజయం సొంతం చేసుకున్నారు 'జబర్దస్త్' వేణు. ఆయన స్ఫూర్తితో 'జబర్దస్త్' ధన్ రాజ్ అదే బాటలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ధన్ రాజ్ ఒక కథను రెడీ చేసుకుని 'విమానం' షూటింగు సమయంలో సముద్రఖనికి చెప్పాడట. ఆయనకి కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని తెలుస్తోంది. దసరాకి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరగుతోంది.
'జబర్దస్త్' వేణు బాటలోనే అడుగులు ముందుకు వేయడానికి మరో కమెడియన్ రెడీ అవుతున్నాడు. ఆ కమెడియన్ పేరే ధన్ రాజ్. బుల్లితెరపై నవ్వులు పూయించి కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ధన్ రాజ్ చాలానే సినిమాలు చేశాడు. అయితే 'జబర్దస్త్' తప్పితే సినిమాలో పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ మధ్య కాలంలో తనకి వేషాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఆయన మెగా ఫోన్ పట్టనున్నాడనే టాక్ వినిపిస్తోంది.
ధన్ రాజ్ ఒక కథను రెడీ చేసుకుని, 'విమానం' షూటింగు సమయంలో సముద్రఖనికి చెప్పాడట. ఆయనకి కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని తెలుస్తోంది. సముద్రఖని ప్రధాన పాత్రలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో చాలా ఎమోషనల్ గా ఉంటుందట. ఎంటర్ టైన్మెంట్ మిస్ చేయకుండానే భావోద్వేగాలకు పెద్ద పీఠ వేస్తూ రెండు బ్యాలన్స్ అయ్యేలా స్క్రిప్ట్ రాసుకున్నట్టు తెలుస్తోంది. దసరాకి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారట. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుందని చెబుతున్నారు. అయితే థియేట్రికల్ రిలీజ్ పరంగా చిన్న సినిమాలు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్న తరుణంలో ధన్ రాజ్ ముందు మాములు సవాల్ ఉండదు. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే తప్ప ఇలాంటివి నెగ్గడం కష్టం.
తక్కువ షెడ్యూల్స్ లో షూట్ పూర్తి చేసేలా మొత్తం ప్లాన్ సిద్ధం చేసుకున్నారని తెలిసింది. నిర్మాత, సాంకేతిక వర్గం తదితర వివరాలు ఒకటి రెండు రోజుల్లో తెలిసిపోతాయని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. నటుడిగా మంచి టైమింగ్ తో పేరు తెచ్చుకున్న ధన్ రాజ్ మరి డైరెక్టర్ గా ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి. ధన్ రాజ్ కనక డైరెక్టర్ గా డెబ్యూతో హిట్టు కొడితే కెరీర్ ని కొత్తగా మొదలుపెట్టొచ్చు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఆడియన్స్ ని థియేటర్ దాకా రప్పించేంత కంటెంట్ ఏం రాసుకున్నాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Also Read: బిగ్ బాస్ లో ట్విస్ట్.. కంటెస్టెంట్ గా ఎమ్మెల్యే..!!