/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/swati-jpg.webp)
Colors Swathi: కలర్స్ స్వాతి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే తన హావభావాలతో సినిమాల్లో నటించింది. కలర్స్ షో ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్వాతి.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చింది. అందులో హీరోయిన్ త్రిష చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. అనంతరం అష్టాచెమ్మా సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఫుల్ ఫాలోయింగ్ సంపాందించుకుంది. అనంతరం అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. తర్వాత జల్సా సినిమాకు ఇలియానాకు డబ్బింగ్ చెప్పి యువత మనసులు కొల్లగొట్టింది. ఇక నాగచైతన్య నటించిన 100పర్సంట్ లవ్ సినిమాలో గాయనిగా కూడా అలరించింది. ఈ క్రమంలోనే యువ హీరో నిఖిల్ సరసన కార్తీకేయ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. నవీన్ చంద్రతో త్రిపుర సినిమా చేసిన స్వాతి.. 2018లో వివేక్ వాసు అనే వ్యక్తిని వివాహం చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటుంది.
విడాకులపై నేను స్పందించను..
ఇప్పుడు మళ్లీ రీఎంట్రీకి సిద్ధమైంది. ఇటీవల మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి 'సోల్ ఆఫ్ సత్య' పేరుతో ఓ ఆల్బమ్ చేసింది. తాజాగా 'మంత్ ఆఫ్ మధు' సినిమాతో మరోసారి సందడి చేసేందుకు రెడీ అయింది. ఇందులో మరోసారి నవీన్ చంద్ర పక్కన నటించింది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానాలు ఇచ్చింది స్వాతి. ఈ క్రమంలోనే ఓ విలేకరి మీరు విడాకులు తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది.. దీనిపై మీ సమాధానం ఏంటి అని అడిగారు. దీనిపై స్పందించిన స్వాతి.. 'నేను ఇవ్వ.. ఆ అవసరం నాకు లేదు. కలర్స్ ప్రోగ్రామ్ చేస్తున్న సమయంలో నాకు కేవలం పదహారేళ్లు. అప్పట్లో సోషల్ మీడియా లేదు. అప్పుడు సోషల్ మీడియా ఉంటే నన్ను ఫుట్‌బాల్ ఆడేసేవారేమో. నటిగా నాకు కొన్ని రూల్స్ ఉంటాయి. కాబట్టి విడాకులపై స్పందిచను' అని చెప్పింది.
Supreme Hero #SaiDharamTej cherishes his friendship with #SwathiReddy from their college days at #MonthOfMadhu trailer launch event!!🤗♥️@IamSaiDharamTej#ColorsSwathi#TFNReels#TeluguFilmNagarpic.twitter.com/kcfDI5WpSq
— Telugu FilmNagar (@telugufilmnagar) September 26, 2023
We both studied BSE Together, Sai Dharam Tej is my classmate says Actress Swathi Reddy.
Watch full video here 👇
▶️ https://t.co/RefJ5YRyZO#MonthOfMadhu#SwathiReddy#SaiDharamTej#Indiaglitz#IndiaglitzTelugupic.twitter.com/ybEPUzCKgW— IndiaGlitz Telugu™ (@igtelugu) September 26, 2023
తేజు, నేను డిగ్రీ క్లాస్ మేట్స్..
అలాగే ఈ కార్యక్రమంలో హీరో తేజు గురించి ఓ ఆసక్తికర విషయం కూడా వెల్లడించింది. తేజు, తాను బీఆఎస్సీ కలిసి చదువుకున్నామని.. ఇద్దరం క్లాస్ మేట్స్ అని తెలిపింది. ప్రస్తుతం స్వాతి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గత కొన్ని రోజులుగా స్వాతి విడాకులు తీసుకున్న వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: రెబల్ స్టార్ వర్సెస్ బాలీవుడ్ బాద్‌షా..!!