AP Politics: 48 గంటల సైలెన్స్ డే.. ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు: కలెక్టర్ హరినారాయణన్

నెల్లూరు జిల్లాలో ప్రశాంత ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. 2024 ఎన్నికల నేపథ్యంలో 48 గంటల సైలెన్స్ డే నిర్వహించారు. జిల్లాలో ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు తెలిపారు.

AP Politics: 48 గంటల సైలెన్స్ డే.. ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు: కలెక్టర్ హరినారాయణన్
New Update

Collector M Harinarayanan: నెల్లూరు జిల్లాలో ప్రశాంత ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. 2024 ఎన్నికల నేపథ్యంలో 48 గంటల సైలెన్స్ డే నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో మొత్తం ఓటర్లు 20,61,800 వీరిలో పురుషులు 10,80,654, మహిళలు 10,52,819, ట్రాన్స్ జెండర్‌లు 211 మంది వున్నారు. జిల్లాలో ఎన్నికలకు 1446 పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ నిర్వహణ కోసం 14,687 మంది సిబ్బంది, రిజర్వ్ సహా 20 వేల మంది అందుబాటు ఉంచారు. పోలింగ్ సిబ్బంది తరలించడం కోసం జీపీస్ కూడిన 638 వాహనాలు, 85 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులు 1624 ఇంటి వద్దే ఓటుకు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు తనిఖీల్లో 5 కోట్ల 53 లక్షలు నగదు, లిక్కర్, ఇతర మెటల్స్ అన్నీ కలిపి సీజ్ చేశామని అధికారులు తెలిపారు.

ఆటంకాలు కలిగించాని చూస్తే కఠిన చర్యలు:

ఈరోజు నుంచి ఎన్నికల వరకు సలెన్స్ పిరియడ్ ఉంది. జిల్లాలో ఓటు లేనివారు, బయట వ్యక్తులు నెల్లూరు జిల్లాలో వుండరాదని జిల్లా అధికారులు తెలిపారు. అంతేకాకుండా లాడ్జిలు, కల్యాణ మండపంలలో చెక్ చేస్తామని, జిల్లాలో 144 సేక్షన్ అమలులోకి వస్తుంది.. ఎక్కడ నలుగురు కంటే ఎక్కువ గుమి కూడకూడ రాదని తెలిపారు. మద్యం అమ్మకాలు నిలిపి వేశాం. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారాదు. పత్రికలో ఎంసీఎం అనుమతితో ఎలక్షన్‌లలో అభ్యర్థులకు మూడు వాహనాలకు అనుమతి ఉంటుందన్నారు. ఎలక్షన్ సమయంలో ఓటర్లకు నీటి సౌకర్యం, టెంట్‌లు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. మోడల్ పోలింగ్ స్టేషన్‌లు 12 ఏర్పాటు చేశాం. ఓటర్లు అందరూ గుర్తింపు పొందిన కార్డుతో ఓటు కేంద్రాలకు వెళ్ళాలని కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లాలో ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మాట్లాడుతూ.. పోలింగ్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ వాతావరణంలో జరిగేలా చూస్తామన్నారు. పోలింగ్‌కు ఎవరైనా ఆటంకాలు కలిగించాని చూస్తే చాలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్చి 16 నుంచి ఇప్పటివరకు 2,76,000,00 నగదు, ఇతర లిక్కర్, మెటల్స్ అన్నీ కూడా సీజ్ చేశామని తెలిపారు. గెస్ట్ హౌస్‌లు, కల్యాణ మండపంలు, లాడ్జిలు అన్నీ చెక్ చేస్తున్నాం, బయట వ్యక్తులు ఎవరూ లేకుండా చూస్తామని ఆయన తెలిపారు.

రాజకీయాలపై చర్చ ఉండకూడదు:

మరోవైపు తిరుపతిలో 13వ తేదీన పోలింగ్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రవీణ్ కుమార్, తిరుపతి జిల్లా కలెక్టర్ PC తెలిపారు. పోలింగ్ కోసం రిజర్వ్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచామన్నారు. మొత్తం 2,140 పోలింగ్ స్టేషన్లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు టెంట్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ పీసీ అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఓ.ఆర్.ఎస్.పంపిణీ చేస్తామన్నారు. మొబైల్ ఫోన్లు పోలింగ్ స్టేషన్లలోకి అనుమతించబడదన్నారు. వాట్సాప్ గ్రూపులలో కూడా రాజకీయాలపై చర్చ ఉండకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు కాకుండా బయటి వ్యక్తులు ఉండకూడదు, శ్రీవారి భక్తులు పోలింగ్ సమయంలో తిరుపతిలో ఉంటే దర్శన టోకెన్లు తప్పనిసరిగా చూపించాలన్నారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ PC తెలిపారు.

ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 12 మంది మావోయిస్టులు మృతి

#lok-sabha-elections-2024 #ap-politics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe