Viral Video: పేరుకు టాప్ రెస్టారెంట్‌.. బిర్యానీలో ఏమో బొద్దింకలు.. వీడియో వైరల్!

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో వడ్డించే బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చింది. అటు నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు.

New Update
Viral Video:  పేరుకు టాప్ రెస్టారెంట్‌..  బిర్యానీలో ఏమో బొద్దింకలు.. వీడియో వైరల్!

హైదరాబాద్‌(Hyderabad)లో బిర్యానీ(Biryani) వరల్డ్‌ వైడ్‌ ఫేమస్‌.. భాగ్యనగరం అనగానే అందరికి వెంటనే గుర్తొచ్చేది బిర్యానీనే. బిర్యానీలు చాలా రకాలు కానీ.. హైదరాబాద్‌ బిర్యానీ చాలా డిఫరెంట్‌. దీని అర్థం హైదరాబాద్‌లో బిర్యానీ ఎక్కడైనా బాగుంటుందని కాదు.. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. కొన్ని చోట్ల రెస్టారెంట్ల యాజమాన్య నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిన్నగాక మొన్న ఫేమస్ బావర్చి బిర్యానీలో బల్లి ప్రత్యక్షమవగా.. తాజాగా మరో ప్రముఖ రెస్టారెంట్‌లో బొద్దింక కనిపించింది.


మొన్న బల్లి.. నిన్న బొద్దింక.. నెక్ట్స్?

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో వడ్డించిన బిర్యానీలో బొద్దింక కనిపించింది. జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో వడ్డించే బిర్యానీలో పురుగు ఉన్నట్లు గుర్తించిన వినియోగదారుడు ఆ ఘటనను వీడియో కూడా తీశాడు. కొద్ది రోజులుగా నగరంలోని కొన్ని రెస్టారెంట్లలో అపరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తున్నారనే ఫిర్యాదులు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రాజేంద్రనగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఓ కస్టమర్‌కు వడ్డించిన బిర్యానీలో బల్లి తోక కనిపించిందని ఆరోపణలు వచ్చాయి. గతంలో ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఆర్డర్‌ చేసిన బిర్యానీలో బల్లి చనిపోయినట్లు వినియోగదారుడు గుర్తించారు.

రెస్టారెంట్లలో శుభ్రత లేదా?
వరుస ఘటనలతో నగరంలోని వివిధ రెస్టారెంట్లలో పరిశుభ్రత ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై బిర్యానీ ఇతర వంటకాల్లో కీటకాలు, బల్లులు, బొద్దింకలు ఉన్నాయని ఫిర్యాదులు నమోదవుతున్నాయి. రోడ్‌సైడ్ స్టాల్స్, చిన్న హోటళ్లలో మాత్రమే కాకుండా కొన్ని ప్రముఖ రెస్టారెంట్‌లలో కూడా సరైన పరిశుభ్రత పద్ధతులు లేవని ఇది సూచిస్తుంది. నగరంలోని అన్ని రెస్టారెంట్లు పరిశుభ్రత విధానాలను పాటించేలా GHMC ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఇప్పటికీ ఫిర్యాదులు వెల్లువెత్తుతునే ఉన్నాయి.

కఠిన చర్యలు తీసుకోవాలి: మేయర్‌
వినియోగదారులకు భద్రత కల్పించే క్రమంలో నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఫుడ్‌ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు తమ తమ ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నుంచి శాంపిళ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి పరీక్షించాలని మేయర్‌ విజయలక్ష్మి సూచించారు. ల్తీ ఆహారంపై క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని, హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రమైన వంటశాలల ఆవశ్యకతను, నాణ్యమైన పదార్థాలను వినియోగించాలని మేయర్‌ సూచించారు. కల్తీని అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ద్వారా చర్యలు చేపట్టాలని మేయర్ పిలుపునిచ్చారు. ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు తమ తనిఖీల సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం) విభాగంతో సహకరించాలని చెప్పారు.

Also Read: ‘టీవీ షోలో ఛాన్స్ ఇప్పిస్తా..’ ఓయో రూమ్‌లో మేకప్‌ ఆర్టిస్ట్‌పై జూ.ఆర్టిస్ట్‌ అఘాయిత్యం!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు