Coaching Sector : కోచింగ్ సెక్టార్ లో అటువంటి ప్రకటనలు ఇక కనిపించవు కోచింగ్ సెంటర్స్ ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు ఇవ్వడాన్ని కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. వీటి పై అభ్యంతరాలు చెప్పాలని కోరింది. దీని తరువాత ఈ నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. By KVD Varma 18 Feb 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Coaching Sector : కోచింగ్ సెక్టార్‌లో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలపై వినియోగదారుల రక్షణ నియంత్రణ సంస్థ CCPA మార్చి 16 వరకు ప్రజల అభిప్రాయాలను కోరింది. అధికారిక ప్రకటన ప్రకారం, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు(Coaching Sector), లా సంస్థలు, ప్రభుత్వం, స్వచ్ఛంద వినియోగదారుల సంస్థలతో సహా సంబంధిత అన్ని వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపిన తరువాత ఈ ముసాయిదా మార్గదర్శకాలను సిద్ధం చేసింది. సూచనలను మార్చి 16 వరకు పంపవచ్చు ఈ ముసాయిదాపై(Coaching Sector) ప్రజల అభిప్రాయాలను కోరుతున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను 30 రోజుల్లోగా (మార్చి 16, 2024 నాటికి) సంబంధిత ప్రభుత్వ శాఖకు తెలియచేయాల్సి ఉంటుంది. డ్రాఫ్ట్ లో ఏముంది? డ్రాఫ్ట్ "కోచింగ్" ని నిర్వచిస్తుంది. తప్పుదారి పట్టించే ప్రకటనల(Coaching Sector) క్రిందకు వచ్చే పరిస్థితులను నిర్దేశిస్తుంది. ఉదాహరణకు, విజయవంతమైన అభ్యర్థులు ఎంచుకున్న కోర్సు పేరు మరియు కోర్సు వ్యవధికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టడంతోపాటు ప్రకటనల్లోని ఇతర సమాచారం కూడా తప్పుదారి పట్టించేదిగా పరిగణించబడుతుందని డ్రాఫ్ట్ మార్గదర్శకాలు పేర్కొన్నాయి. “విద్యార్థుల వ్యక్తిగత ప్రయత్నాలను గుర్తించకుండా, విద్యార్థుల విజయం పూర్తిగా కోచింగ్‌కు మాత్రమే కారణమని ప్రకటనలలో తప్పుగా సూచించడం” కూడా తప్పుదారి పట్టించేదిగా పరిగణించబడుతుంది మరియు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు(Coaching Institutes) తమ విజయంలో కోచింగ్ ప్రమేయం ఎంతవరకు ఉందో స్పష్టంగా పేర్కొనవలసి ఉంటుంది. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు విజయవంతమైన అభ్యర్థి పొందిన ర్యాంక్, వారు ఎంచుకున్న కోర్సు పేరు, కోర్సు వ్యవధి, అటువంటి కోర్సు పేమెంట్ కిందకు వస్తుందా? లేకపోతె యాడ్స్‌లో ఉచితంగా అందించబడిందా అనే వివరాలను వెల్లడించాలి. Also Read : తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే.. తప్పుదారి పట్టకుండా.. కోచింగ్ సెక్టార్‌లో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల నుండి రక్షించడమే మార్గదర్శకాల ఉద్దేశమని CCPA తెలిపింది. కోచింగ్‌లో నిమగ్నమైన ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుంది. కోచింగ్ సెక్టార్ ద్వారా తప్పుదోవ పట్టించే ప్రకటనలు వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం నియంత్రించడం జరుగుతుంది. ప్రతిపాదిత మార్గదర్శకాలు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తాయి. జనవరి నెలలో కోచింగ్ తరగతులకు(Coaching Sector) సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయంతీసుకుంది. ఆ సమయంలో ప్రభుత్వం ప్రైవేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్(Private Coaching Institutes) లకు మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్గదర్శకాల ప్రకారం, 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న విద్యార్థులు కోచింగ్ తరగతులలో ప్రవేశం ఇవ్వడాన్ని నిషేధించారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇది కాకుండా, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే నిర్ణయం కూడా తీసుకోవచ్చు. Watch this Interesting Video : #education #coaching-sector #ccpa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి