New Rule To Coaching Center : కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కొత్త రూల్ ని ప్రకటించింది. ఇక నుంచి కోచింగ్ సెంటర్ల(Coaching Center) లో 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న విద్యార్థుల(Students) ను చేర్చుకోకూడదని ప్రకటించింది. అలాగే కోచింగ్ సెంటర్లు విద్యార్థులను వారి తల్లిదండ్రులను తప్పుదారి పట్టించేలా వాగ్దానాలను కానీ, హామీలు కానీ ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది.
కోచింగ్ సెంటర్లు అధిక ఫీజులు వసూలు చేసినా ఇతర అవకతవకలకు పాల్పడినా లక్ష రూపాయల జరిమానా లేక కోచింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ ను రద్దు చేసేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ లను నియంత్రించడానికి చట్టపరమైన చర్యలను తీసుకోనున్నట్లు అధికారులు వివరించారు.
బోధనా విధానాలు మెరుగుపరచడం..
విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడంతో పాటు వాళ్లకు సరైన సౌకర్యాలు కల్పించడం బోధనా విధానాలు మెరుగుపరచడం కోసం కేంద్ర విద్యాశాఖ పలు అంశాలను సూచించింది. సెకండరీ పాఠశాల విద్య(Secondary School Education) ను పూర్తి చేసిన వారిని మాత్రమే కోచింగ్ సెంటర్లలో పేరు నమోదు చేసుకుని వారికి అనుమతినివ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read : News Education Policy : భారత విద్యార్థుల కోసం ప్రత్యేక కోర్సులు రూపొందించిన అగ్రరాజ్యం..!!
తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసిన వారినే..
16 ఏళ్ల లోపు వారిని మాత్రం కోచింగ్ సెంటర్లలో చేర్చుకోకూడదు. అలాగే కోచింగ్ సెంటర్లలో పూర్తి అర్హతలు ఉన్న సిబ్బందిని మాత్రమే ట్యూటర్ లుగా తీసుకోవాలని తెలిపింది. ఇందులో తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసిన వారినే తీసుకోవాలని పేర్కొంది. సిబ్బంది అర్హత, కోచింగ్ సెంటర్ వివరాలు శిక్షణ అందించే కోర్సులు, వసతి సౌకర్యాలు, ఫీజు రిఫండ్ గురించి సరైన సమాచారాన్ని ముందుగానే వెబ్ సైట్ లో రూపొందించాలని తెలిపింది.
విద్యార్థులు సాధించిన ఫలితాల గురించి ఎటువంటి మోసపూరిత ప్రకటనలు చేయకూడదని కేంద్రం ఆదేశించింది. విద్యార్థులకు అవసరమైన కనీసం సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. అలాగే కోచింగ్ సెంటర్లలలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం నివారించేందుకు భద్రతా ప్రమాణాలు పాటించాలి.
ఒకే పేరుతో వివిధ ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలను తప్పనిసరిగా ఆ బ్రాంచ్ ల ను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది.
అలాగే కోచింగ్ సెంటర్లలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌తో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
Also read: మణిపూర్ లో ఆగని హింస..తాజా దాడుల్లో ఐదుగురు పౌరులు మృతి!