సూర్యాపేటలో సీఎం పర్యటన..పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న కేసీఆర్..

సీఎం కేసీఆర్ ఈరోజు సూర్యపేట జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. అక్కడ మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రత్యేక చాపర్ లో సూర్యపేట కు కేసీఆర్ చేరుకోనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తరువాత ఆయన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కేసీఆర్ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది..

New Update
సూర్యాపేటలో సీఎం పర్యటన..పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న కేసీఆర్..

KCR public meeting: సీఎం కేసీఆర్ ఈరోజు సూర్యపేట జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. అక్కడ మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రత్యేక చాపర్ లో సూర్యపేట కు కేసీఆర్ చేరుకోనున్నారు. కొత్తగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవనాన్ని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని అదే విధంగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని,బీఆర్ఎస్ పార్టీ జిల్లా  కార్యాలయాన్నిఆయన  ప్రారంభించనున్నారు.. అదేవిధంగా కొత్త కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.

తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడే జిల్లా అభివృద్ధి పై అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత కొత్త వ్యవసాయ మార్కెట్ దగ్గర పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో  పాల్గొని ప్రసంగిస్తారు.

సభ కోసం భారీ ఏర్పాట్లు..!

భారీబహిరంగ సభ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపుగా 100 ఎకరాల్లో సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ముందస్తు జాగ్రత్తగా రైన్ ప్రూఫ్ టెంట్స్ ఏర్పాటు చేశారు. సభకు రెండు లక్షల మంది ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది.

హైదరాబాద్, విజయవాడ హై వే పక్కనే సభా స్థలం ఏర్పాటు చేయడంతో ప్రజలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తమ తమ వాహనాల్లో నేరుగా సభ సమీపంలోకి చేరుకునేలా 4 రూట్స్ ఏర్పాటు చేశారు. సభ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో  3 వేల మంది పోలీసులతో  భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది.  జిల్లా SP రాజేంద్రప్రసాద్  భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ట్రాఫిక్ మళ్లింపు..!

సభా ప్రాంగణం హైదరాబాద్ టు విజయవాడ హైవే ను ఆనుకొని ఉండడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్ వెళ్ళవలసిన వాహనాలను కోదాడ, మిర్యాలగూడ మీదుగా మళ్లించారు. అదే విధంగా విజయవాడ వెళ్ళవలసిన వాహనాలను నార్కెట్ పల్లి, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా పోలీసులు మళ్లించడం జరిగింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు