CM Revanth: పనికి వస్తావనుకుంటే పరువు తీస్తావా?.. దానంపై రేవంత్ ఫైర్!

హైడ్రాపై కామెంట్స్ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని దానంకు సీఎం వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

New Update
CM Revanth: పనికి వస్తావనుకుంటే పరువు తీస్తావా?.. దానంపై రేవంత్ ఫైర్!

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై సీఎం రేవంత్‌ సీరియస్‌ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల దానం వ్యవహరశైలిపై సీఎం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లో ఆక్రమణలు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన హైడ్రాపై దానం చేసిన కామెంట్లపై రేవంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో ఉండి ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టేలా చేయడం ఏంటని సీఎం దానం నాగేందర్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. రేవంత్ క్లాస్ తీసుకోవడంతో దానం నాగేందర్ వెనక్కి తగ్గారు. హైడ్రా మంచిపని చేస్తుందంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయినా.. సీఎంకు దానంపై కోపం చల్లారలేదన్న టాక్ కాంగ్రెస్ లో వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి: జన్వాడ ఫాంహౌస్ కూల్చివేత.. హైడ్రాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో అయినా.. సత్తా చాటాలన్న లక్ష్యంగా ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన దానం నాగేందర్ ను పార్టీలో చేర్చుకున్నారు. ఆ సమయంలో సీనియర్లు వద్దన్నా రేవంత్ పట్టించుకోలేదు. గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పని చేసిన దానం నాగేందర్ ను చేర్చుకుంటే పార్టీని మళ్లీ బలోపేతం చేయవచ్చని రేవంత్ ఆ సమయంలో భావించారు.

అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో దానంను సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు రేవంత్. అయితే.. ఆ ఎన్నికల్లో దానం బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే.. దానం నాగేందర్ పార్టీ బలోపేతం కోసం పని చేయకుండా వివాదాల్లో దూరడంపై సీఎం ఆయనపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: RUNAMAFI: రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్.. ఇవాళ్టి నుంచి ఫిర్యాదుల స్వీకరణ!



Advertisment
Advertisment
తాజా కథనాలు