/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/CM-Revanth-Reddy-1-1.jpg)
తెలంగాణలో భారీగా పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు కాలిఫోర్నియాలోని మౌంటేన్ వ్యూలోని గూగుల్ (Google) సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సీఎం సందర్శించారు. గూగుల్ ఉన్నతాధికారులతో రేవంత్ టీమ్ చర్చలు జరిపింది. తెలంగాణలో టెక్ సేవల విస్తృతి, ఏఐ సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర ప్రాజెక్టుల్లో భాగం పంచుకునే అంశంపై వీరు గూగుల్ ఉన్నత అధికారులతో చర్చించారు. సీఎం వెంట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు.