Telangana Thalli: సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

TG: ఈరోజు డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.

New Update
Telangana Thalli: సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

Telangana Thalli: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో  తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈరోజు సచివాలయం ఎదుట విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. కాగా కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట పెట్టడాన్ని బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా ఖండించాయి. విపక్షాల డిమాండ్లను పక్కన పెట్టిన రేవంత్ సర్కార్.. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పక్క ఏర్పాటు చేసి తీరుతామని చెప్పింది. ఈ క్రమంలో ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను తిప్పి కొట్టేందుకు తెలంగాణ  తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది రేవంత్ సర్కార్.

రేవంత్ కు కేటీఆర్ వార్నింగ్...

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రోజే అంబేడ్కర్‌ విగ్రహం వద్ద చెత్త తొలిగిస్తామన్నారు. బీఆర్ఎస్ రాగానే సచివాలయం పరిసరాల్లో చెత్త తొలగిస్తాం.. ఢిల్లీ గులాంలు రాష్ట్ర ఆత్మగౌరవం అర్థం చేసుకుంటారని ఆశించలేం అని అన్నారు. చెత్తమాటలు మాట్లాడిన రేవంత్‌రెడ్డి నైజం, వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తోందని అన్నారు. 

కేటీఆర్ కు రేవంత్ కౌంటర్...

బీఆరెస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని రేవంత్ అన్నారు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు. కానీ సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదని చెప్పారు. సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదని, అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చేతనైతే ఎవడైనా విగ్రహం మీద చేయి వేయాలంటూ సీఎం రేవంత్ సవాల్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు